Shekar Movie : ‘శేఖర్’ తో హ్యాట్రిక్ కొట్టబోతున్న రాజ ‘శేఖర్’..

సరికొత్త లుక్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్‌లో డా.రాజశేఖర్..

Shekar Movie : ‘శేఖర్’ తో హ్యాట్రిక్ కొట్టబోతున్న రాజ ‘శేఖర్’..

Shekar Glimpse

Updated On : November 25, 2021 / 5:24 PM IST

Shekar Movie: ఒకప్పుడు రాజశేఖర్ సినిమాలంటే ఆ క్రేజ్ వేరేలా ఉండేది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా డిఫరెంట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు.

Nani : భార్యకు బర్త్‌డే విషెస్ భలే చెప్పాడుగా..

వరుస ఫ్లాపులతో కాస్త నెమ్మదించిన యాంగ్రీ స్టార్, అగ్రెసివ్ హీరో, డా.రాజశేఖర్ ‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో వరుస విజయాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’.. Man With The Scar పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్..

Dr.Rajasekhar : పవర్‌ఫుల్ ‘శేఖర్’ గా డా.రాజ‘ ‘శేఖర్’..

జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. గురువారం సాయంత్రం శేఖర్’ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీం.

Niharika Konidela : స్పెయిన్‌లో చిల్ అవుతున్న నిహారిక కపుల్..

అరకు ప్రాంతంలో తోట బంగ్లాలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రాజశేఖర్ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, తిరిగి ఓ కేసును సాల్వ్ చెయ్యడానికి వచ్చినట్లు చూపించారు. రాజశేఖర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో, సరికొత్తగా కనిపించడంతో పాటు మరోసారి తన నటనతో ప్రేక్షకాభిమానులను అలరించనున్నారని అర్థమవుతోంది.

Chiranjeevi : టికెట్ రేట్లపై దయచేసి పునరాలోచించండి-చిరు విన్నపం..

ఆత్మీయ రాజన్, ముస్కాన్, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘శేఖర్’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.