Chiranjeevi : టికెట్ రేట్లపై దయచేసి పునరాలోచించండి-చిరు విన్నపం..

ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కు కుంటుంది - మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi : టికెట్ రేట్లపై దయచేసి పునరాలోచించండి-చిరు విన్నపం..

Chiru

Movie Theatres: రోజుకి నాలుగు ఆటలు మాత్రమే.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు.. మిడ్ నైట్ షోలు, బెన్ఫిట్ షోలు, స్పెషల్ షోలకు నో పర్మిషన్.. సామాజిక సేవాకార్యక్రమాలకు సంబంధించి నిధుల సేకరణ కోసమైతేనే బెన్ఫిట్ షోలకు అనుమతి అని తేల్చి చెప్పేసింది ఏపీ ప్రభుత్వం.

దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా అలజడి రేగింది. బాబోయ్ ఇలాగైతే మా సినిమాల పరిస్థితి ఏంటి అంటూ నిర్మాతలు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. రాబోయే పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలకు భారీ నష్టం తప్పేలా లేదు. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఇప్పుడు ఈ అంశం గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం..
థియేటర్ల మనుగడ కోసం సినీ పరిశ్రమపై ఆధారపడ్డ ఎన్నో కుటుంబాల బ్రతుకు దెరువు కోసం కాలానుగుణంగా దేశంలోని అన్ని స్టేట్స్‌లో ఉన్న విధంగా నిర్ణయిస్తే మేలు జరుగుతుంది. దేశమంతటా ఒకటే జీఎస్టీ ట్యాక్స్ ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలో అదే వెసులు బాటు వుండడం సమంజసం. దయచేసి పునరాలో చించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కు కుంటుంది’. అంటూ చిరు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.