Sherlyn Chopra : రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటాను.. కానీ ఒక్క కండిషన్.. బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ పెళ్లి వార్త ఎప్పుడూ హాట్ టాపిక్కే. గతంలో కూడా పలువురు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామని అన్నారు. రాహుల్ ని తన పెళ్లి గురించి అడిగితే మాత్రం ఏం మాట్లాడదకుండా ఓ స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు.

Sherlyn Chopra wants to marry Rahul Gandhi but having one Condition

Sherlyn Chopra :  ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఒకరు. కాంగ్రెస్(Congress) అగ్ర నేతగా రాహుల్ గాంధీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల వరుస పాదయాత్రలు చేస్తూ వచ్చే ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పెళ్లి గురించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ పెళ్లి వార్త ఎప్పుడూ హాట్ టాపిక్కే. గతంలో కూడా పలువురు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామని అన్నారు. రాహుల్ ని తన పెళ్లి గురించి అడిగితే మాత్రం ఏం మాట్లాడదకుండా ఓ స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు.

తాజాగా బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. హైదరాబాద్ అమ్మాయి అయిన షెర్లిన్ చోప్రా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. పలు టీవీ షోలతో కూడా బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. తాజాగా ముంబైలో ఓ ప్లేస్ కి వెళ్లగా మీడియా, పలువురు జనాలు షెర్లిన్ ని చుట్టుముట్టారు. ప్రశ్నలు, ఫొటోలతో హడావిడి చేశారు.

Chiranjeevi : తమ్ముడు జనసేనానికి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్న మెగాస్టార్.. ఇండస్ట్రీతో కూడా సపోర్ట్ చేయిస్తూ..

ఓ వ్యక్తి మీరు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటారా అని షెర్లీన్ చోప్రాని అడిగాడు. షెర్లిన్ నవ్వుతూ దానికి సమాధానమిస్తూ.. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటాను కానీ ఒక్క కండిషన్ నా ఇంటిపేరు చోప్రా మాత్రం మార్చుకోను అని చెప్పింది. దీంతో షెర్లిన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇప్పటికే రాహుల్ ని పెళ్లి చేసుకుంటాను అని పలువురు గతంలో కూడా అన్నారు. మరి రాహుల్ షెర్లిన్ వ్యాఖ్యలపై ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.