Shine Tom Chacko : షూటింగ్ లో డ్రగ్స్ వాడాడు అంటూ ఫిర్యాదు.. మరో వైపు పోలీసులకు దొరక్కుండా పారిపోయి..?

ఇవాళ ఉదయం నుంచి షైన్ టామ్ చాకో పై పలు ఆరోపణలు వస్తున్నాయి.

Shine Tom Chacko Escaped from Narcotics Raid in Kochi

Shine Tom Chacko : మలయాళం స్టార్ నటుడు షైన్ టామ్ చాకో ప్రస్తుతం తమిళ్, తెలుగులో కూడా బిజీగా ఉన్నాడు. తెలుగులో రంగబలి, దసరా, దేవర, డాకు మహారాజ్.. లాంటి పలు సినిమాలతో మెప్పించాడు. అయితే ఇవాళ ఉదయం నుంచి షైన్ టామ్ చాకో పై పలు ఆరోపణలు వస్తున్నాయి.

మలయాళం నటి విన్సీ సోని ఇతనిపై ఫిర్యాదు చేసింది. షైన్ టామ్ చాకో షూటింగ్ లో డ్రగ్స్ తీసుకొని తనతో మిస్ బిహేవ్ చేసాడని కేరళ ఫిలిం ఛాంబర్ తో పాటు కేరళ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది.

Also Read : Uday Raj : ఒకప్పుడు ఆర్టిస్టులకు అసిస్టెంట్ గా పనిచేసి.. ఇప్పుడు హీరోగా సినిమా..

మరో వైపు కొచ్చిలోని ఓ హోటల్ లో డ్రగ్స్ అమ్ముతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు ఆ హోటల్ కి వెళ్లిన సమయంలోనే షైన్ టామ్ చాకో మూడో అంతస్తు రూమ్ కిటికీ నుంచి రెండో అంతస్తుకి దూకి అక్కడ్నుంచి మెట్ల మార్గంలో బయటకు పారిపోయాడని అంటున్నారు. షైన్ టామ్ చాకో పారిపోయే సన్నివేశాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై షైన్ టామ్ చాకో ఇప్పటివరకు స్పందించలేదు. అతను పరారయ్యాడని అంటున్నారు.

Also Read : Sampoornesh Babu : బంగారం రేట్లు పెరగడంపై సంపూర్ణేష్ బాబు కామెంట్స్.. ఒకప్పుడు బంగారం పని చేసి..