Ghost Movie Review : ఘోస్ట్ మూవీ రివ్యూ.. కన్నడ మనీహైస్ట్.. ఎలివేషన్స్‌కి మాత్రం నో డౌట్..

కన్నడలో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజవ్వగా రెండు వారాల తర్వాత నేడు నవంబర్ 4న మిగిలిన భాషల్లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Shiva Rajkumar Ghost Movie Review and Rating

Ghost Movie Review : కన్నడ స్టార్ హీరో డా.శివరాజ్ కుమార్(Shiva Rajkumar) మెయిన్ లీడ్ లో యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన సినిమా ‘ఘోస్ట్’. డైరెక్టర్ MG శ్రీనివాస్ ‘ఘోస్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. కన్నడ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. కన్నడలో ఘోస్ట్ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజవ్వగా రెండు వారాల తర్వాత నేడు నవంబర్ 4న మిగిలిన భాషల్లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

కథ విషయానికి వస్తే..
ప్రభుత్వం ఓ జైలుని ప్రైవేటీకరణ చేయిస్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమం రోజు పెద్దన్న(శివరాజ్ కుమార్) కొంతమందితో కలిసి ఆ జైలుని హైజాక్ చేస్తాడు. ఆ జైలులో ఉన్న ఖైదీలను అడ్డం పెట్టుకొని తన పని చేసుకోవాలనుకుంటాడు. జైలుని, ఖైదీలని కాపాడటానికి ఓ సీనియర్ ACP (జయరామ్)కి అప్పచెప్తారు. అసలు లోపల ఎవరు ఉన్నారు? ఎందుకు జైలుని హైజాక్ చేశారు? అక్కడ ఖైదీలని ఎలా కాపాడాలి అని జయరామ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరో పక్క ఫ్లాష్ బ్యాక్ లో పెద్దన్న ఓ పెద్ద డాన్ అన్నట్టు చూపిస్తాడు. అదే సమయంలో పదేళ్ల క్రితం జరిగిన ఓ 800 కేజీల గోల్డ్ మిస్సింగ్ కేసు గురించి కూడా చూపిస్తారు. అసలు పెద్దన్న ఎవరు? ఎందుకు జైలు ని హైజాక్ చేశాడు? తన పనేంటి? ఎవరికోసం జైలుకి వచ్చాడు? ACP పెద్దన్నని పెట్టుకున్నాడా? గోల్డ్ కేసుకి ఇప్పటి జైలు హైజాక్ కి సంబంధం ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
మొదటి హాఫ్ అంతా పెద్దన్న జైలుని హైజాక్ చేయడం, అసలు జైలుని ఎవరు, ఎందుకు హైజాక్ చేశారో కనిపెట్టడం మీదే సాగుతుంది. అయితే కథ ముందుకి, పదేళ్ల క్రితం వెనక్కి సాగుతుండటంతో ఫస్ట్ హాఫ్ లో కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది ప్రేక్షకులకు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఓ చిన్న సైజు మనీ హైస్ట్ లాగా సాగుతుంది. మనీ హైస్ట్ సిరీస్ లో ఒక ప్లేస్ ని హైజాక్ చేసి అక్కడ తమకు కావాల్సినవి తీసుకొని ఎవ్వరికి దొరక్కుండా ఎలా తప్పించుకుంటారో ఈ సినిమా కూడా సెకండ్ హాఫ్ లో అంతే ఆసక్తిగా సాగుతుంది. ఇక సినిమాలో శివన్నకు లెక్కలేనన్ని ఎలివేషన్స్ ఉంటాయి. ఈ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. ఒక మంచి పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో శివరాజ్ కుమార్ కు బోలెడన్ని ఎలివేషన్ సీన్స్ సినిమా అంతా సాగుతాయి. క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ ఆసక్తిగా ఉంటుంది.

టెక్నికల్ అంశాలకు వస్తే..
సినిమాలో యాక్షన్, ఎలివేషన్ సీన్స్ హైలెట్ గా చెప్పొచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కి ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. కెమెరా విజువల్స్ కూడా సినిమా అంతా ఒక జైలులోనే జరగడంతో అక్కడ నేటివిటీకి తగ్గట్టు బాగా చూపించారు. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేలో కొంచెం తడబడ్డా సెకండ్ హాఫ్ మాత్రం ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. నటీనటుల పరంగా శివన్న పెద్దన్న పాత్రకు న్యాయం చేశాడు. ACP పాత్రలో జయరామ్, రిపోర్టర్ పాత్రలోఅర్చన జోయిస్, క్లైమాక్స్ గెస్ట్ రోల్ లో అనుపమ్ ఖేర్ మెప్పించాడు.

Also Read : Keeda Cola Movie Review : కీడాకోలా మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా?

మొత్తంగా యాక్షన్, హైస్ట్ లాంటి సినిమాలు నచ్చేవాళ్లకు ఈ ఘోస్ట్ సినిమా నచ్చుతుంది. మిగిలిన వాళ్లకు ఇది ‘ఘోస్ట్’ సినిమానే. సినిమాకు 2.5 రేటింగ్ వరకు ఇవ్వొచ్చు.