Keeda Cola Movie Review : కీడాకోలా మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా?

తరుణ్ భాస్కర్(Tharun Bhascker) చాలా గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో వచ్చాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు నవంబర్ 3న రిలీజ్ అయింది.

Keeda Cola Movie Review : కీడాకోలా మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా?

Tharun Bhascker Keeda Cola Movie Review and Rating

Updated On : November 3, 2023 / 3:12 PM IST

Keeda Cola Movie Review : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ ని అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) చాలా గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో వచ్చాడు. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు నవంబర్ 3న రిలీజ్ అయింది. సినిమా టీజర్, ట్రైలర్ తో పాటు, తరుణ్ భాస్కర్ చేసిన ప్రమోషన్స్ తో ముందు నుంచి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఈ కీడాకోలా సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించాడు.

కథ విషయానికొస్తే.. వరదరాజు(బ్రహ్మానందం), వాస్తు(చైతన్య రావు) తాత, మనవడు. వాస్తు ఫ్రెండ్ కౌశిక్(రాగ్ మయూర్) లాయర్. వాస్తు హాస్పిటల్స్ కి స్టిమ్యులేటర్స్(మనిషిలా ఉండే బొమ్మలు) అమ్మే జాబ్ చేస్తూ ఉంటాడు. అలా ఒక బొమ్మని పాడు చేస్తే కోటి రూపాయలు కట్టమని ఓనర్ కోర్టులో కేసు వేస్తాడు. ఆ కోటి రూపాయలు ఎలా సంపాదించాలా అని వాస్తు, కౌశిక్ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక కీడా కోలా అనే కూల్ డ్రింక్ కొనుక్కోగా అందులో బొద్దింక కనిపిస్తుంది. దీంతో వినియోగదారుల ఫోరమ్ ని ఆశ్రయించి కంపెనీ మీద కేసు వేసి కోట్లు సంపాదించనుకుంటారు. అయితే నాయుడు(తరుణ్ భాస్కర్) మర్డర్ కేసులో జైలు నుంచి బయటకి వచ్చి కార్పొరేటర్ అవుదామనుకుంటున్న తన తమ్ముడు జీవన్ దగ్గరికి వచ్చి కీడాకోలా కంపెనీలో పనిలో చేరుతాడు. తనకి కూడా డబ్బులు అవసరమని తెలిసి ఈసారి మర్డర్స్ చేయకుండా నాయుడు స్వయంగా బొద్దింకని ఒక కోలా సీసాలో వేస్తాడు. అది బయటకి వచ్చాక తానే కొనుక్కొని కంపెనీ మీద కేసు వేసి కోట్లు కొట్టేయాలనుకుంటాడు. కానీ ఆ సీసా వాస్తు, కౌశిక్ దగ్గరికి వెళ్లడంతో నాయుడు ఏం చేశాడు? ఇద్దరిలో ఎవరు కంపెనీ మీద కేసు వేశారు? కంపెనీ మనుషులు ఏం చేశారు? వీళ్లకు డబ్బులు వచ్చాయా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఎలాంటి లాజిక్స్ వెతక్కుండా ఉంటే రెండు గంటల పాటు సినిమాని సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మనం కొనే వస్తువులో ఏదైనా లోపం ఉంటే వినియోగదారుల ఫోరమ్ కి వెళ్లొచ్చు అనే పాయింట్ ని క్రైమ్ కామెడీ నేపథ్యంలో చూపించారు. ఫస్ట్ హాఫ్ లో ఒక కథని వేరే వేరే మనుషుల పాయింట్ అఫ్ వ్యూలో చూపించే విధానంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ అంతా రివెంజ్, దాడులు ఉంటాయి. అక్కడక్కడా కొంచెం స్లో నెరేషన్ ఉంటుంది. కొన్నిచోట్ల స్లో మోషన్స్ వాడినా అవి పర్ఫెక్ట్ గ అసెట్ అవుతాయి. కామెడీ మాత్రం అద్భుతంగా పండించాడు తరుణ్. ఉన్న క్యారెక్టర్స్ అందరికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉన్నట్టు చూపించి వాటిని కూడా కామెడీకి వాడుకున్నాడు. సినిమా మొత్తంలో ఒక్క లేడీ క్యారెక్టర్ కూడా లేకపోవడం విశేషం. ఇక భూతులు తిట్టే సన్నివేశాల్లో డైరెక్టర్ తానే సొంతంగా సెన్సార్ చేసుకొని అక్కడ పాత సినిమా పాటలు ప్లే చేసి కడుపుబ్బా నవ్విస్తాడు. అయితే క్లైమాక్స్ మాత్రం తరుణ్ గత సినిమాల్లో లానే.. డబ్బులు బతకడానికి ఉంటే సరిపోతాయి, సొసైటీ గురించి ఆలోచించి అందరూ గొప్పలకు పోతున్నారు అంటూ మెసేజ్ ఇవ్వడం కొంచెం మైనస్ అనిపిస్తుంది. తరుణ్ ఏం చేసినా మళ్ళీ అదే పాయింట్ ని జనాలకు చెప్తున్నాడు అనే ఆలోచన వస్తుంది.

Also Read : Keeda Cola Pre Release Event : ‘కీడా కోలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

ఎవరెవరు ఎలా చేశారంటే.. నాయుడు పాత్రలో తరుణ్ భస్కర్ అదరగొట్టాడు. మొదట నుంచి సినిమాలో ఎవరూ హీరో లేరని చెప్పి చివరికి తానే హీరో అవ్వడం విశేషం. నత్తి ఉన్న పాత్రలో చైతన్య రావు అద్భుతంగా నటించాడు. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో ఆయనకి ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు. సినిమా అంతా వీల్ చైర్ లోనే ఉండి యూరిన్ పైప్ పెట్టుకున్న ఓ పేషంట్ లా కనిపించి అందర్నీ నవ్వించారు. లాయర్ పాత్రలో రాగ్ మయూర్, జీవన్, జీవన్ అసిస్టెంట్ పాత్రలో విష్ణు కడుపుబ్బా నవ్విస్తారు. మధ్యలో గెటప్ శ్రీను యాడ్స్ చేసే హీరోలా కాసేపు కనిపించి మెప్పిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా ప్రేక్షకులని మెప్పిస్తాయి. టెక్నికల్ అంశాలకు వస్తే సినిమా విజువల్స్, సంగీతం చాలా కొత్తగా ట్రై చేశారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా సేల్ అవ్వడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి కీడా కోలా సరదాగా కోలా తాగుతూ చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాకు రేటింగ్ 3 వరకు ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.