×
Ad

Dhandoraa Review : ‘దండోరా’ మూవీ రివ్యూ.. శివాజీ మళ్లీ అదరగొట్టాడుగా..

టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడే ఇది రొటీన్ కులం గొడవలు, ప్రేమ కథ అని అర్థమైపోయింది. (Dhandoraa Review)

Dhandoraa Review

Dhandoraa Review : శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘దండోరా’. లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని నిర్మాణంలో ముర‌ళీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు.(Dhandoraa Review)

కథ విషయానికొస్తే..

దండోరా కథ 2004 – 2019 సంవత్సరాలలో జరిగినట్టు చూపించారు. మెదక్ దగ్గర్లోని ఓ పల్లెటూరులో జరిగే కథ ఇది. ఆ ఊళ్ళో కొన్ని కులాలకు శవాల్ని కాల్చడానికి స్థలం ఉంటే ఇంకొన్ని కులాలకు ఉండదు. శివాజీ(శివాజీ)కి కులం అభిమానం ఎక్కువ. తన కూతురు సుజాత(మనికా చిక్కాల) వేరే కులానికి చెందిన రవి(రవికృష్ణ)ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసి శివాజీ కులానికి చెందిన కొంతమంది రవికృష్ణని చంపేస్తారు. ఇదంతా చూసి శివాజీ కొడుకు విష్ణు(నందు) తన ప్రేమకు కూడా కులం అడ్డొస్తుందని తెలిసి ప్రేమను వదిలేసుకొని తండ్రికి దూరంగా వెళ్ళిపోయి బతుకుతుంటాడు. ఆ ఘటన తర్వాత శివాజీ ఏం చేసాడు? కొడుకు విష్ణు శివాజీకి దగ్గరయ్యాడా? సుజాత ఏమైంది? వేశ్య(బిందుమాధవి)కి శివాజీకి సంబంధం ఏంటి? ఆ ఊరి సర్పంచ్(నవదీప్) ఏం చేసాడు? వేరే కులాలకు శవాలు కాల్చడానికి స్థలం వచ్చిందా.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also See : Pawan Kalyan : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఆ బామ్మను కలిసి, ఆమె కాళ్ళను మొక్కి.. ఫొటోలు వైరల్..

సినిమా విశ్లేషణ..

టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడే ఇది రొటీన్ కులం గొడవలు, ప్రేమ కథ అని అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఊళ్ళో కులాలు, సుజాత – రవి ప్రేమకథతో సాగదీశారు. ఇక కథ 2004 – 2019 మధ్య తిప్పుతూ స్క్రీన్ ప్లే లో కొత్తదనం చూపించాలనుకున్నారు కానీ ఈ కథకు అవసర్లేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసి ఇంటర్వెల్ కి రవి మరణంతో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొల్పుతారు.

సెకండ్ హాఫ్ లో కొంత ఎమోషన్ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అంతా ఎమోషన్ తో సాగదీసినా బాగానే కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. శివాజీ పాత్రని బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ లో శివాజీ ఉన్న కొన్ని సీన్స్ మాత్రం ఊహించరు. అవే సినిమాకు ప్లస్ అవుతాయి. ఇక సినిమా ఓపెనింగ్ సీన్ కి క్లైమాక్స్ కి లింక్ చేసి ముగింపు ఇస్తారు. కొన్ని చిరంజీవి, నాగార్జున రిఫరెన్స్ లు ఫ్యాన్స్ ని అలరిస్తాయి.

ఇలాంటి కులం కథలు తీసుకున్నప్పుడు ఏదో ఒక కులానికి సంబంధించిన కథగానే చూపిస్తారు. సినిమాలో ఒక కులం వాళ్లంతా కలిసి వాళ్ళ కోసం స్మశానం ని మెయింటైన్ చేస్తారు. వేరే కులం వాళ్ళు ఊరి చివర ఎక్కడో కాలుస్తారు. వాళ్ళు కూడా యూనిటీగా ఉండి స్థలం చూసుకోని సమస్యని పరిష్కరించకుండా మాకు స్మశానం లేదు అనడం వింతగా ఉంటుంది. ఒక కులం ఎదగాలి అని చూపించి మళ్లీ చివరకు ఎవరో దానం చేస్తే స్మశానం తీసుకునేదాన్ని హైలెట్ గా చూపించడం అసలు కథలో చెప్పిన పాయింట్ కి కనెక్ట్ అవ్వదు.

ఓ పక్క చావు, మరో పక్క కులం – ప్రేమ అంశాలను ప్రస్తావించినా ప్రేమలో కులం అనే కాన్సెప్ట్ తో కొన్ని వందల సినిమాలు ఉన్నాయి. చావు కాన్సెప్ట్ సరిగ్గా రాసుకోలేకపోయారు. ఒక కులం మీటింగ్ పెట్టుకుంటే తప్పు, ఇంకో కులం మీటింగ్ పెట్టుకుంటే కరెక్ట్ అన్నట్టు, ఒక మతం మీద డైరెక్ట్ గా నెగిటివ్ గా చూపించినా సెన్సార్ దాన్ని కట్ చేయకపోవడం ఏంటో.. ఇలాంటివన్నీ అర్ధం కావు.

ఎక్కడో ఒకచోట కొంతమంది చేసే సంఘటనలు, ఎప్పుడో పాత కాలంలో జరిగే సంఘటనలు పట్టుకొని ఇంకా సమాజం అక్కడే ఆగిపోయింది అన్నట్టు ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు. చిన్నప్పుడు ఒక సంఘటన చూసి ఏదో చేద్దామని డిసైడ్ అయిన వ్యక్తి సర్పంచ్ అయినా ఏమి చేయకుండా వేరే వాళ్ళు దానం చేస్తే దాన్ని పండగ చేసుకునేలా చూపించడం ఏంటో, కథలో చెప్పాలనుకున్న పాయింట్ కి అది పాజిటివ్ గా ఎలా ఉంటుందో దర్శకుడికే తెలియాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఈ సినిమాకు శివాజీ చాలా ప్లస్ అయ్యాడు. తన పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ తన నటనతో అదరగొట్టాడు. కోర్ట్ లో మంగపతి సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు, కోపం తెప్పిస్తాడు, ఏడిపిస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ మొత్తం శివాజీ దండోరా సినిమాని తన భుజాల మీద నడిపించాడు.

మనికా చిక్కాల గ్రామీణ యువతీ పాత్రలో చాలా చక్కగా మెప్పించింది. సీరియల్ నటుడు రవికృష్ణ బాగానే నటించాడు. సర్పంచ్ పాత్రలో నవదీప్ కొత్తగా కనిపించాడు. నందు కొడుకు, భర్తగా రెండు వేరియేషన్స్ లో అద్భుతంగా నటించాడు. బిందు మాధవి వేశ్య పాత్రలో బాగానే మెప్పించింది. మౌనిక రెడ్డి, రాధ్య, దేవి ప్రసాద్, అదితి బావరాజు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Vijay – Rashmika : ఇటు విజయ్.. అటు రష్మిక.. రాబోయే సినిమాల్లో రక్తపాతమే..

సాంకేతిక అంశాలు.. కథ అంతా విలేజ్ నేపథ్యంలో జరగడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకాస్త బెటర్ గా చూపించే అవకాశం ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఒక రొటీన్ పాత కులం ప్రేమ కథకు చావు కాన్సెప్ట్ ని జత చేసి కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఎడిటింగ్ పరంగా అడవిలో కట్టెలకోసం వెళ్లి కొట్టుకోవడం, టీ వల్ల కొట్టుకోవడం.. లాంటి కొన్ని ల్యాగ్, కథకు సంబంధం లేని సీన్స్ కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా చిన్న సినిమాని కావలిసినంత బడ్జెట్ లో బాగానే తెరకెక్కించారు.

మొత్తంగా ‘దండోరా’ సినిమా ప్రేమకు, చావుకు కులం అంటగడుతున్నారు అనే పాత మెసేజ్ తో ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..