Sonu Nigam : సెల్ఫీ ఇవ్వలేదని బాలీవుడ్ స్టార్ సింగర్ పై దాడి.. శివసేన ఎమ్మెల్యే తనయుడిపై ఫిర్యాదు చేసిన సింగర్..

తాజాగా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ పై సెల్ఫీ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే తనయుడు దాడి చేశాడు. బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ సోమవారం రాత్రి ముంబైలోని ఓ ఏరియాలో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ కి ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్ళాడు.................

Shivasena MLA Son attacked on bollywood star singer sonu nigam for refusing to give selfie at mumbai

Sonu Nigam :  ఇటీవల సెల్ఫీ వివాదాలు ఎక్కువవుతున్నాయి. సెలబ్రిటీలు సెల్ఫీ ఇవ్వకపోతే కొంతమంది దాడులకు పాల్పడటం ఇప్పుడు పలు చోట్ల వినిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ పై సెల్ఫీ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే తనయుడు దాడి చేశాడు. బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్ సోమవారం రాత్రి ముంబైలోని ఓ ఏరియాలో జరిగిన మ్యూజిక్ ఈవెంట్ కి ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్ళాడు.

ప్రదర్శన అనంతరం పలువురు సెల్ఫీ కోసం సోనూ నిగమ్ వెనక పడగా అతని సిబ్బంది అడ్డుకొని అతన్ని తీసుకెళ్తుండగా శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ తనయుడు స్వప్నిల్ సోనూ నిగమ్ తో సెల్ఫీ కోసం ప్రయత్నించగా సోనూ నిరాకరించాడు. దీంతో కోపం తెచ్చుకొని స్వప్నిల్, అతని మనుషులు సోని నిగమ్ పై దాడి చేశారు. పక్కనే ఉన్న సోనూ నిగమ్ సిబ్బందిని పైనుంచి కిందకి తోసేసి, సోనూ ఫ్రెండ్ ని కూడా పక్కకి తోసేసి ఈవెంట్లో రచ్చ చేశారు. శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ తనయుడు స్వప్నిల్ ఈవెంట్లో సోనూ నిగమ్ పై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

RRR : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్.. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా RRR

అయితే దీనిపై సోనూ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ తనయుడు స్వప్నిల్ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ మాట్లాడుతూ నా కొడుకు కావాలని చేయలేదు, అనుకోకుండా తోపులాట జరిగింది అంటూ మాట్లాడారు. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోనూ నిగమ్ కి మద్దతుగా, శివసేన ఎమ్మెల్యే ప్రకాష్, అతని తనయుడు స్వప్నిల్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.