Shobha Shetty : మొన్న తెలుగు బిగ్ బాస్.. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్.. శోభా శెట్టి హవా..

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చింది. నిన్నటి వరకు ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ గా సాగింది. అయితే బిగ్ బాస్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ లో కూడా విజయంతంగా సాగుతుంది. ఇకపోతే కన్నడలో ప్రస్తుతం సీజన్ 11 నడుస్తుంది.

Shobha Shetty wild card entry to kannada Bigg Boss

Shobha Shetty : తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చింది. నిన్నటి వరకు ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ గా సాగింది. అయితే బిగ్ బాస్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ లో కూడా విజయంతంగా సాగుతుంది. ఇకపోతే కన్నడలో ప్రస్తుతం సీజన్ 11 నడుస్తుంది.

Also Read : Nayanthara : “మూడు కాదు.. ముప్పై సెకన్లు..” దొరికిపోయిన నయన్.. ధనుష్ చేసింది కరెక్టే అంటున్న నెటిజన్స్

అయితే ఈ సీజన్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరికొందరిని హౌస్ లోకి పంపించారు. కాగా ఈ వైల్డ్ కార్డు లిస్ట్ లో తెలుగు బుల్లితెర నటి, అలాగే బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి కూడా ఉంది. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ 7తో భారీ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. దీనికంటే ముందు కార్తీక దీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. శోభా శెట్టి గా కాకుండా మోనితగా అందరికి ఎక్కువ గుర్తుంటుంది ఈమె.


సీరియల్ లో లాగానే హౌస్ లో కూడా తన మోనిత క్యారెక్టర్ చూపించి విమర్శలు అందుకుంది. అందుకే చివరి దాకా హౌస్ లో ఉండలేకపోయింది. మరి ఇప్పుడు ఈ కన్నడ బిగ్ బాస్ హౌస్ లో అయినా చివరి వరకు ఉండి కప్ గెలుచుకుంటుందా.. లేక తెలుగు బిగ్ బిగ్ బాస్ లో లాగా మధ్యలోనే వెళ్లిపోతుందా అన్నది చూడాలి. ఇక మోనిత కన్నడ బిగ్ బాస్ స్టేజ్ పై ఉన్న ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.