Trikala : శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ముఖ్య పాత్రల్లో రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాణంలో మణి తెల్లగూటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘త్రికాల’. సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి, తనికెళ్ళ భరణి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Trikala)
ఎపుడో 9 నెలల క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. కాస్త ఆలస్యం అయినా ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది, డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. త్వరలో డేట్ ఫిక్స్ చేసి ప్రకటించనున్నారు.
Also Read : Samantha : కోపం ఎందుకు సమంత..? ఫిట్నెస్ పోస్ట్ పై నెటిజన్ కామెంట్.. సమంత రిప్లై వైరల్..
మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్, అజయ్ కొత్త నటన, శ్రద్దా దాస్ ఇన్వెస్టిగేషన్ చేసే పాత్రతో పాటు థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. త్రికాల సినిమాకు సౌత్ లోనే కాక నార్త్ ఇండియాలో కూడా బిజినెస్ జరిగిందట. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి, యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించడం విశేషం.
Also Read : Nivetha Pethuraj : కుక్క కరిస్తే పెద్ద విషయం కాదట.. హీరోయిన్ వ్యాఖ్యలు వైరల్.. భగ్గుమన్న నెటిజన్లు..