Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. స్టార్ కంటెస్టెంట్ అవుట్.. ట్విస్ట్ అదిరింది!

బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యింది అప్పుడే వన్ వీక్ కూడా అయ్యింది(Bigg Boss 9 Telugu). లాంచ్ ఎపిసోడ్, నామినేషన్స్, కాప్టెన్సీ టాస్క్, ఫస్ట్ కెప్టెన్, ఇప్పుడు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.

Shrashti Verma is the first eliminated contestant of Bigg Boss Season 9.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 మొదలయ్యింది అప్పుడే వన్ వీక్ కూడా అయ్యింది. లాంచ్ ఎపిసోడ్, నామినేషన్స్, కాప్టెన్సీ టాస్క్, ఫస్ట్ కెప్టెన్, ఇప్పుడు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్. అంతా అలా అలా జరిగిరిపోతోంది. కానీ, ఆడియన్స్ కి మజా ఇవ్వడంలో మాత్రం తగ్గేదే లే అంటున్నాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్ జరిగినప్పటి నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అంటూ చాలా మందిలో ఆ క్యూరియాసీటీ నెలకొంది. ఎందుకంటే,(Bigg Boss 9 Telugu) మొదటివారం దాదాపు స్టార్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఎవరు బయటకు వెళ్తారు అనే ఉత్కంఠ నెలకొంది.

Balakrishna-Gopichand: చారిత్రక కథ, యాక్షన్ బ్యాక్డ్రాప్.. బాలయ్య సరికొత్త అవతార్.. దసరాకి స్టార్ట్?

ఇక ఫస్ట్ వీక్ కి గాను శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో వోటింగ్ స్టార్ అయిన మొదటిరోజు నుంచే సుమన్ శెట్టికి టాప్ వోటింగ్ పడింది. తరువాత సంజన, తనూజ, ఇమ్మానుయేల్ ఉన్నారు. నిజానికి సంజన ఆట తీరుకి చాలా మంది ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే అవుతుంది అనుకున్నారు. కానీ, ఏకంగా ఆమె కెప్టెన్ అయ్యారు. ఇక వీరిలో లేట్ లో ఫ్లోరా సైనీ, శ్రష్ఠి వర్మ నిలిచారు.

వీరిలో ఖచ్చితంగా శ్రష్ఠి వర్మ ఉంటారు ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నారు. ఎందుకంటే, శ్రష్ఠి వర్మ మంచి కొరియోగ్రాఫర్. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి, కొన్నివారల పాటు ఉంటారు అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ మొదటి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా శ్రష్ఠి వర్మ అయ్యారు. దీనికి సంబందించిన షూట్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ఆదివారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.