Shrasti Verma
Shrasti Verma : స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి అతనిపై కేసు పెట్టి ఆయన అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఢీ షోతో ఫేమ్ తెచ్చుకున్న శ్రష్ఠి వర్మ, జానీ మాస్టర్ దగ్గర పలు సంవత్సరాలు డ్యాన్స్ అసిస్టెంట్ గా పనిచేసింది. ఆ తర్వాత అతని దగ్గర నుంచి బయటకు వచ్చేసి అతనిపై ఆరోపణలు చేసి కేసు పెట్టడంతో జానీ మాస్టర్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లి కూడా వచ్చారు.(Shrasti Verma)
జానీ మాస్టర్, అతని భార్య.. శ్రష్ఠి వర్మ చేసే ఆరోపణలు అబద్దాలు అని అన్నారు. దీంతో కొన్నాళ్లపాటు శ్రష్ఠి వర్మ, జానీ మాస్టర్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు శ్రష్ఠి వర్మ సొంతంగా డ్యాన్స్ మాస్టర్ గా చేసుకుంటుంది. అయితే ఈ భామ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ 9 త్వరలోనే మొదలుకానుంది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనల్ చేసారు. అందులో శ్రష్ఠి వర్మ ఒకరట.
Also Read : PT Selvakumar : విజయ్ పై సంచలన వ్యాఖ్యలు.. ఆస్తులు అమ్ముకున్నా.. కనీసం పట్టించుకోలేదు.. నాపై కుట్ర చేసారు..
ఇప్పుడు శ్రష్ఠి వర్మ కానీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే మరింత వైరల్ అవుతుంది. ఈమెతో బిగ్ బాస్ ఎమోషనల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకొని టీఆర్పీ రేటింగ్స్ కూడా పెంచుకునే ప్లాన్ చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. బయట శ్రష్ఠి వర్మ పలు ఆరోపణలు చేసి, ఇంటర్వ్యూలలో పలు విషయాలు చెప్పింది. మరి బిగ్ బాస్ లో ఇంకెన్ని విషయాలు చెప్పి వైరల్ అవుతుందో చూడాలి. అయితే బిగ్ బాస్ కి వెళ్తుందనే వార్తలపై శ్రష్ఠి వర్మ స్పందించలేదు.