PT Selvakumar : విజయ్ పై సంచలన వ్యాఖ్యలు.. ఆస్తులు అమ్ముకున్నా.. కనీసం పట్టించుకోలేదు.. నాపై కుట్ర చేసారు..
తాజాగా పులి సినిమా నిర్మాత పీటీ సెల్వకుమార్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో మాట్లాడుతూ..(PT Selvakumar)

PT Selvakumar
PT Selvakumar : తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లాస్ట్ సినిమా చేస్తున్నారు. పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయబోతున్నాడు. రాజకీయాల్లో ఎదగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు విజయ్. ఇలాంటి సమయంలో విజయ్ తో సినిమా తీసి నష్టపోయిన ఓ నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు చేసారు.(PT Selvakumar)
విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన పులి అనే సినిమా 2015లో రిలీజయి భారీ డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటించగా శ్రీదేవి కీలక పాత్ర చేసింది. అప్పటి విజయ్ బడ్జెట్ ని మించి దాదాపు 130 కోట్లు ఖర్చుపెట్టి ఈ సినిమా తీయగా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని భారీ నష్టాలను చూసింది ఈ సినిమా.
Also See : Sravanthi Chokarapu : షోడశ స్వర్ణగౌరి పూజ చేసుకున్న యాంకర్ స్రవంతి.. ఫొటోలు..
నిర్మాత పీటీ సెల్వకుమార్ కామెంట్స్:
తాజాగా నిర్మాత పీటీ సెల్వకుమార్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో తీసిన పులి సినిమా ఎన్నో కష్టాలను దాటుకొని రిలీజ్ చేసాం. నాపై కొంతమంది తెలిసిన వాళ్ళే కుట్ర చేసి సినిమా రిలీజ్ ముందు ఐటీ రైడ్స్ చేయించారు. సినిమా ఆగిపోయింది అని ప్రచారం చేసారు. నా 27ఏళ్ళ కష్టార్జితం అంతా ఆ సినిమా మీదే పెట్టాను. మొదటిరోజే సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ కూడా థియేటర్స్ నుంచి లేచి వెళ్లిపోయి నన్ను తిట్టుకున్నారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. వేరే ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు.
పులి సినిమాతో నాకు భారీ నష్టాలు రావడంతో నా ఆస్తులన్నీ అమ్ముకున్నాను. విజయ్ కనీసం నన్ను పట్టించుకోలేదు. సినిమా రిలీజయిన 5 రోజుల వరకు కూడా నన్ను కలవలేదు. నేను నష్టపోయానని తెలిసి కూడా రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాతో నేను నష్టపోతే విజయ్ కెరీర్ కి మాత్రం ఏం కాలేదు. ఆ సినిమాకు నా దగ్గర 25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకు 45 కోట్ల వరకు తీసుకున్నాడు. విజయ్ నన్ను పట్టించుకోకపోయినా, విజయ్ వల్ల నేను ఆస్తులు పోగొట్టుకున్నా అతని ఫ్యాన్స్ నన్ను ద్రోహిగా చూసారు అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Sudigali Sudheer : ‘సర్కార్’ షో విన్నర్స్ కి బైక్స్ అందించిన సుడిగాలి సుధీర్..
దీంతో పీటీ సెల్వకుమార్ వ్యాఖ్యలు తమిళనాట చర్చగా మారాయి. తమిళ రాజకీయాల్లో విజయ్ ప్రత్యర్థులు ఈ కామెంట్స్ ని తెగ వైరల్ చేస్తున్నాయి. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం రాజకీయంగా నెగిటివ్ చేయడానికే ఈ కామెంట్స్ అంటున్నారు. మొత్తానికి పీటీ సెల్వకుమార్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ పరంగా కూడా చర్చకు తెరలేపాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే పిటి సెల్వకుమార్ విజయ్ దగ్గర చాలా ఏళ్ళు మేనేజర్ గా, పీఆర్వోగా పనిచేసారు కూడా.