Shreemani : 100 పర్సెంట్‌ లవ్‌ సినిమాతో ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ ‘నేను అరడుగుల బుల్లెట్‌..’ సాంగ్ తో ఫేమ్..

తాను రాసిన పాటల గురించి లిరిక్ రైటర్ శ్రీమణి చెప్తూ.. (Shreemani )

Shreemani

Shreemani : 100 పర్సెంట్‌ లవ్‌ సినిమాతో పాటల రచయితగా సినీ పరిశ్రమకు పరిచయమైన శ్రీమణి ఆ తర్వాత అనేక సినిమాలకు పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు శ్రీమణి పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన సినీ జర్నీ గురించి మాట్లాడారు.(Shreemani)

ఈ సంవత్సరం తాను రాసిన పాటల గురించి లిరిక్ రైటర్ శ్రీమణి చెప్తూ.. తండేల్‌లో బుజ్జితల్లి, హైలెస్సా పాటలతో పాటు లక్కీ భాస్కర్‌లోని నిజమా కలా, ఆయ్‌ సినిమాలోని పాటలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నవేశం తాలూకా లోతైన భావం చెప్పడమే. ఇలాంటి పాటలు రాసే అవకాశం రావడం గర్వంగా ఉంది అని అన్నారు.

Also See : Bhadrakaali : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

Sreemani

సాహిత్య పరంగా వచ్చిన మార్పులు, ఛాలెంజ్ ల గురించి మాట్లాడుతూ.. నాకు ప్రతి పాటకు ఏదో ఒక ఛాలెంజ్‌ ఉంటుంది. గత ఐదేళ్లలో సంగీతంతో పాటు సాహిత్యంలో సౌండ్‌ డిజైనింగ్ మారింది. శబ్ధ సౌందర్యం ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉండాలి. దానికి తగ్గట్టే నేను స్టాండర్స్‌ మిస్‌ అవ్వకుండా, పదేళ్ల తరువాత కూడా నా పాట వినేలా సాహిత్యం ప్రెష్‌గా అనిపించేలా, పాటను సున్నిత పదాలతో అందరికి అర్థమయ్యేలా, ఎమోషన్‌ మిస్‌ అవ్వకుండా రాయడం, శబ్దంలో కూడా అర్థం ఉండేలా చూసుకోవడం చేస్తాను అని తెలిపారు.

ఇటీవల సోషల్ మీడియా ట్రెండ్‌లో పాట ఇన్‌స్టంట్‌ హిట్‌ అవ్వడం గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు అది రచయింతలందరికి కత్తి మీద సాము లాంటింది. గతంలో పాట రీచ్‌ అవ్వడానికి టైమ్‌ పట్టేది. ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రభావంతో వినగానే నచ్చేయాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అందుకే తగ్గట్టుగానే పాటలు ఇన్‌స్టంట్‌ చార్ట్‌బస్టర్‌లుగా నిలుస్తున్నాయి. కానీ ఇదే పాటను పదేళ్ల తర్వాత విన్నా సేమ్‌ ఫీలింగ్‌ ఉండాలి అనే భావనతోనే రాస్తున్నాము అందరం అని చెప్పారు శ్రీమణి.

Also See : Pawan Kalyan : బాబోయ్.. ఒక్క రోజులో ఇన్ని పవన్ కళ్యాణ్ ఫొటోలు.. ఇటు OG, అటు ఉస్తాద్ అప్డేట్స్.. ఫ్యాన్స్ కి పండగే..

ఇక తన పాటల గురించి చెప్తూ.. నేను అరడుగుల బుల్లెట్‌.. సాంగ్ రాసిన తర్వాత ఎక్కువగా హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌లు రాసే అవకాశాలు వచ్చాయి. తర్వాత ప్రేమ పాటల అవకాశాలు వచ్చాయి. నన్ను గేయ రచయితగా పరిచయం చేసిన డైరెక్టర్ సుకుమార్‌ గీతా గోవిందం సినిమాలో నేను రాసిన వచ్చిందమ్మా.. సాంగ్ గురించి మెచ్చుకొని బాగా రాస్తున్నావు అన్నారు. నన్ను ఇండస్గ్రీకి పరిచయం చేసిన వ్యక్తి అలా అభినందించడం గొప్పగా అనిపించింది. మహర్షి సినిమాలో పాట విని సిరివెన్నెల సీతరామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి అభినందించడం నా జీవితంలో మరిచిపోలేను. ప్రస్తుతం దుల్కార్‌సల్మాన్‌ ఆకాశంలో ఓ తార, సాయి దుర్గా తేజ్‌ సంబరాల ఏటిగట్టు, ఇండియా హౌస్‌ లతో పాటు పలు సినిమాలకు రాస్తున్నాను అని తెలిపారు.

తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. పరిపూర్ణ రచయితగా ఎదగాలి అనేది నా బలమైన కోరిక. ఇంతకు ముందు నేను తెలిసిన ఫ్రెండ్స్ తో కథా చర్చల్లో పాల్గొనేవాడిని. సంభాషణలు రాయాలని ఉంది. ఈ పుట్టిన రోజు నుంచి నా సాహిత్యపు జర్నీలో మరో మెట్టు ఎక్కాలని, కొత్తగా సాధించాలి అని నా లక్ష్యం అని తెలిపారు శ్రీమణి.