నా భర్తని అందుకే పెళ్లి చేసుకున్నా.. ఆర్య, బన్నీ మీరూ ఆ పని చేయండి మరి..
ఆర్య, అల్లు అర్జున్‌లకు సరికొత్త ఛాలెంజ్ విసిరిన హీరోయిన్ శ్రియ..

ఆర్య, అల్లు అర్జున్‌లకు సరికొత్త ఛాలెంజ్ విసిరిన హీరోయిన్ శ్రియ..
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి పట్టున ఉన్న సెలబ్స్ సోషల్ మీడియా పుణ్యమా అని తమ రోజువారి పనుల తాలుకు వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అలాగే కరోనాపై పోరాటానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ సొట్టబుగ్గల శ్రియ సరికొత్త చాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది.
తన భర్త అండ్రీ కొచ్చివ్ కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఈ చాలెంజ్‌ను(బార్తన్ సాఫ్ కరో) స్వీకరించాల్సిందిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ యంగ్ హీరో ఆర్యలతో పాటు పలువురిని నామినేట్ చేశారు. వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని ఈ సందర్భంగా శ్రియ ఛాలెంజ్ విసిరింది.
Read Also : బికినీ ఫోటోకి మేకప్ అవసరమా? నటుడి భార్యకి నెటిజన్ ప్రశ్న.. ఆమె ఆన్సర్ అదుర్స్..
‘నేను నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? ఎందుకంటే.. నాకు వంట పాత్రలను కడగటం ఇష్టం ఉండదు. పెళ్లైనా మగవాళ్లు అందరూ.. వారి అందమైన భార్యలకు సాయం చేయాలని నేను ఛాలెంజ్ విసురుతున్నాను. నేను నా స్నేహితులు కొందరని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను’ అంటూ పోస్ట్ చేసింది. 2018లో ఆండ్రీ కొచ్చివ్ అనే బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్‌ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత శ్రియ సినిమాలకు దూరంగా ఉంటోంది.