శ్రియకు వార్నింగ్ ఇచ్చి వదిలిన లండన్ పోలీసులు

తమిళ సినిమా ‘సండైక్కారి’ షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లిన శ్రియకు ఊహించని సంఘటన ఎదురైంది..

  • Publish Date - December 12, 2019 / 08:41 AM IST

తమిళ సినిమా ‘సండైక్కారి’ షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లిన శ్రియకు ఊహించని సంఘటన ఎదురైంది..

షూటింగుల నిమిత్తం విదేశాలకు వెళ్లే నటీనటులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తాజా ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన నటి శ్రియ లండన్‌ పోలీసుల చేతిలో చిక్కి షాక్‌కు గురైంది. శ్రియ గత ఏడాది రష్యాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రి కోస్కిన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది గ్యాప్ తర్వాత తమిళంలో ‘సండైక్కారి’ అనే చిత్రంలో నటిస్తోంది.  

విమల్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.మాదేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకురాలుగా నటిస్తోంది. విమల్‌ ఆమె కంపెనీలో పనిచేసే ఇంజినీర్‌గా నటిస్తున్నాడు. కాగా ‘సండైక్కారి’ చిత్ర షూటింగ్‌ ఇటీవల లండన్‌లో ప్లాన్ చేశారు. లండన్‌లోని అతి పెద్ద విమానాశ్రయం స్టెన్‌పోర్టులో విమల్, శ్రియ, సత్యన్‌ నటించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సమయంలో శ్రియ తెలియకుండా విమానాశ్రయంలోని భద్రతా ప్రాంత సరిహద్దులను దాటి వెళ్లిందట.

దీంతో లండన్‌ భద్రతాధికారులు ఆమెను చుట్టి ముట్టి అనధికారికంగా ఈ ప్రాంతంలోకి ఎలా వచ్చావ్?, ఎవరు నువ్వు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట. దీంతో శ్రియ బిత్తరపోయిందట. ప్రాబ్లమ్ పెద్దదయ్యేలా ఉందని గ్రహించి ఆ ప్రాంతానికి కాస్త దూరంగా ఉన్న విమల్‌ వెంటనే అక్కడికి వెళ్లి తగిన ఆధారాలు చూపి పరిస్థితిని వివరించగా.. పోలీసులు  శ్రియను చిరునవ్వుతో వదిలిపెట్టినట్లు మూవీ టీమ్ చెప్పారు.