Shriya Saran threshing paddy in the field with her daughter
Shriya Saran : టాలీవుడ్ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరోస్ సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకొని ఒక పాపకి జన్మనిచ్చింది. ఆ తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటుంది.
Also Read : Matka Twitter Review : వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్విట్టర్ రివ్యూ..
ఇక శ్రియా శరణ్ నిరంతరం తన కూతురికి సంబందించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన కూతురితో కలిసి పొలంలో వరి నూర్పిడి చేస్తుంది. వరి నూర్పిడి ఎలా చెయ్యాలో తన కూతురు రాధకి కూడా నేర్పిస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో 2018లో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకుంది శ్రియా శరన్. 2021 జనవరి 10న శ్రియకు రాధ పుట్టింది. ఇక ఈమె పుట్టిన 10 నెలల తర్వాత తమ కూతురిని పరిచయం చేశారు ఈ జంట.