Fried Chicken : బాయ్ ఫ్రెండ్‌‌కు చికెన్ తినిపించిన శృతి

శృతి..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో బాయ్ ఫ్రెండ్ హజారిక ఉన్నారు. వీరిద్దరూ కలిసి చికెన్ తో తయారు చేసిన వంటకాలను తినడం కనిపించింది. వేయించిన చికెన్ ఇష్టపడుతాము అంటూ క్యాప్షన్ పెట్టారు.

Chicken

Shruti Haasan : లోకనాయకుడిగా పేరుగాంచిన అద్భుత నటుడు కమల్ హాసన్ ముద్దుల తనయ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా గాకుండా..సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. పలు సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్ముడు..తన నటనతో అందర్నీ ఆకట్టుకొంటోంది. ఈమె..శాంతను హజారికతో గత కొన్ని రోజుల నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తుంటారు శృతి హాసన్.

Read More : Family Disputes : కుటుంబ కలహాలతో భార్య ముక్కు కొరికిన భర్త

లాక్ డౌన్ సమయంలో…వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా..శృతి..ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో బాయ్ ఫ్రెండ్ హజారిక ఉన్నారు. వీరిద్దరూ కలిసి చికెన్ తో తయారు చేసిన వంటకాలను తినడం కనిపించింది. వేయించిన చికెన్ ఇష్టపడుతాము అంటూ క్యాప్షన్ పెట్టారు. యూ ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామా అని శృతి అన్నారు. చివరిలో శృతి హాసన్..హజారికాకు తినిపించారు. ఫ్రై చికెన్ అంటూ సాంగ్ పాడుకుంటూ..ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.