Family Disputes : కుటుంబ కలహాలతో భార్య ముక్కు కొరికిన భర్త

తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడో భర్త. కర్ణాటకలోని ధారవాడ తాలూకాలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది.

Family Disputes : కుటుంబ కలహాలతో భార్య ముక్కు కొరికిన భర్త

Family Disputes

Family Disputes : తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడో భర్త. కర్ణాటకలోని ధారవాడ తాలూకాలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. బెళగావి జిల్లా దొడ్డవాడ గ్రామానికి చెందిన ఉమేష్ గీత భార్యా భర్తలు.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఉమేష్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో ఐదేళ్ల క్రితం గీత భర్తతో గొడవపడి పిల్లల్ని తీసుకుని అమ్మినబావిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపధ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆరునెలల క్రితం గీత  ఆమె పుట్టింటి నుంచి భర్త వద్దకు తిరిగి వచ్చింది. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు.

భార్యతో తరచూ గొడవపడుతూనే ఉన్నాడు. మళ్లీ ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లి పోయింది. భార్యను తీసుకువచ్చేందుకు శుక్రవారం మద్యం తాగి అత్తారింటికి వెళ్లాడు ఉమేష్ . మద్యం తాగి వచ్చిన ఉమేష్ తో వెళ్లటానికి భార్య ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ గొడవ తారాస్ధాయికి చేరేసరికి మద్యం మత్తులో ఉన్న ఉమేష్ కోపం పట్టలేక భార్య ముక్కు కొరికాడు.

ఆ నొప్పి భరించలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఉమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. గీత కేకలు విని వచ్చిన ఇరుగు పొరుగు వారు ఆమెను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఉమేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.