Pushpa
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఫారెస్ట్, స్మగ్లింగ్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కే పుష్ప నుండి ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్లు, పాటపై అంచనాలు పెంచేశాడు సుక్కు. ప్రతి సినిమాను ఎంతో పద్ధతిగా తెరకెక్కించి హిట్ కొట్టే ఈ క్రీజీ డైరెక్టర్.. ఈ సినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాను రెండు భాగాలుగా మలచగా.. పాత్రలను కూడా అదే రేంజ్‌లో సెలెక్ట్ చేసుకున్నాడు.
Aha: 90 డేస్.. 20 మూవీస్.. అలరించే షోలతో ఆహా అనాల్సిందే!
పుష్ప రాజ్ గా బన్నీ ఎంతగా అట్రాక్ చేశాడో.. శ్రీవల్లిగా రష్మిక కూడా ఫస్ట్ లుక్ లోనే కట్టిపడేసింది. అయితే, ఇప్పుడు శ్రీవల్లిపై సాగే ఓ పాటను త్వరలోనే విడుదల చేయనున్నారు యూనిట్. ఇప్పటికే పుష్ప నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కో దాక్కో దాక్కో మేక’ రిలీజ్ చెయ్యగా సాలిడ్ రెస్పాన్స్‌తో పాటు రికార్డ్ స్థాయి వ్యూస్ వచ్చాయి. కాగా.. ఇప్పుడు చూపే బంగారమయనే శ్రీవల్లి అంటూ మరో పాటను సిద్ధం చేస్తున్నారు.
Lavanya Tripathi: ఒంపు సొంపుల నిధి ఈ అందాల రాక్షసి
ఈ చిత్రంలో శ్రీవల్లి పాటకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఇస్తూ ఓ వీడియో షేర్ చేశాడు సంగీతం అందిస్తున్న రాక్ స్టార్ డీఎస్పీ. స్టూడియోలో డీఎస్పీ మ్యూజిక్ ప్లే చేస్తుంటే.. పక్కనే ఉన్న గాయకుడు సిద్ శ్రీరామ్ చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయనే అంటూ పాట పాడుతున్నాడు. ఈ పాటను అక్టోబర్ 13న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడటం విశేషం. మెలోడీయెస్ గా సాగుతున్న ఈ పాటు సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పాల్సిన పనిలేదు.
https://twitter.com/adityamusic/status/1447190576311373836?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1447190576311373836%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fdevi-sri-prasad-sid-sriram-magical-srivalli-song-from-pushpa-vedio-update-246023%2F
#SRIVALLI HINDI VERSION🎶
2nd SINGLE frm #PUSHPAIn d Unvelievable Mesmerising Voice of Dearest @javedali4u
& d Sweet Romantic Lyrics of @raqueebalam
Coming to U on 13th OCT.. 11:07AM❤️#PushpaTheRiseOnDec17 @alluarjun @aryasukku @iamRashmika @MythriOfficial @adityamusic https://t.co/kEEt7xmzgH
— DEVI SRI PRASAD (@ThisIsDSP) October 9, 2021