Siddharth Anand blaming audience about result of Hrithik Roshan Fighter Movie
Siddharth Anand : బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్.. బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ సినిమాలతో నేషనల్ వైడ్ మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. గత ఏడాది ‘పఠాన్’ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి.. వెయ్య కోట్ల క్లబ్ లో స్థానం దక్కించుకున్న రెండో దర్శకుడిగా రికార్డుల్లో నిలిచారు. ఇక హృతిక రోషన్‌తో బ్యాంగ్ బ్యాంగ్, వార్.. వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకున్న సిద్దార్థ్.. మూడోసారి ‘ఫైటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో.. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తే అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న రిలీజైన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది. ఇక ఈ రిజల్ట్ గురించి దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆడియన్స్ కి తెలివి లేదు అందుకే సినిమా సక్సెస్ కాలేకపోయింది అన్నట్లు వ్యాఖ్యలు చేశారు.
Also read : Vishwambhara : రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. ‘విశ్వంభర’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన మెగాస్టార్
“మన దేశంలో ఎంతమంది విమాన విజ్ఞానం గురించి చదువుకొని ఉంటారు..? ఎంతమందికి పాస్‌పోర్ట్ ఉంది..? ఎంతమంది విమానంలో ప్రయాణించి ఉంటారు..? మహా అయితే వందలో పది శాతం మందే విమానం ప్రయాణం చేసి ఉంటారు. మిగిలిన 90 శాతం ప్రజలకి దాని గురించి కూడా తెలియదు. అలాంటి వారు ఫైటర్ మూవీ చూస్తే.. అది ఎలియాన్ సినిమాలా అనిపిస్తుంది” అంటూ ఆడియన్స్ ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు పై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. మీకు సినిమా తియ్యడం చేతకాక ప్లాప్ అందుకొని, ఇప్పుడు ఆడియన్స్ ని నిందిస్తున్నారా.. అంటూ ప్రశ్నిస్తూ సిద్దార్థ్ ని ట్రోల్ చేస్తున్నారు. కాగా ఫైటర్ సినిమా కేవలం హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యింది.
Movie flop ho jaye toh blame audience par dal do.#Fighter https://t.co/O2qyXXwihi
— Vijay (@iam_vijuu) February 2, 2024