Tillu Square Collections : వామ్మో రెండు రోజుల్లో ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ ఇన్ని కోట్లా? సిద్ధూ కెరీర్ హైయెస్ట్..

అసలు మీడియం రేంజ్ హీరోలకు ఈ రేంజ్ కలెక్షన్స్ రెండు రోజుల్లో రావడం అంటే చాలా కష్టం.

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square Movie Two Days Collections Full Details

Tillu Square Collections : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజయి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమాకి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. డీజే టిల్లు సినిమాకు ఇది పర్ఫెక్ట్ సీక్వెల్ అని, సిద్ధూ, అనుపమ యాక్టింగ్ అదరగొట్టేశారని చెప్తున్నారు ప్రేక్షకులు.

ఇక టిల్లు స్క్వేర్ సినిమా కలెక్షన్స్ లో కూడా అదరగొడుతుంది. టిల్లు స్క్వేర్ సినిమా మొదటి రోజే ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరచగా రెండు రోజుల్లో ఏకంగా 45.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టిల్లు స్క్వేర్ కి వస్తున్న ఈ కలెక్షన్స్ చూసి టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇక అమెరికాలో కూడా ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది.

Also Read : Jai Hanuman : సూపర్ ఫాస్ట్ గా ‘జై హనుమాన్’ వర్క్.. అంజనాద్రి లొకేషన్ అదిరిపోయిందిగా.. వీడియో షేర్ చేసిన ప్రశాంత్ వర్మ..

అసలు మీడియం రేంజ్ హీరోలకు ఈ రేంజ్ కలెక్షన్స్ రెండు రోజుల్లో రావడం అంటే చాలా కష్టం. కానీ సిద్ధూ తన టిల్లు క్యారెక్టర్ తో ప్రేక్షకులని మెప్పించి సూపర్ హిట్ కొట్టేసాడు. ఇవాళ ఆదివారం కాబట్టి రేపటికి ఈజీగా 70 కోట్లు గ్రాస్ వచ్చేస్తుందని భావిస్తున్నారు. ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ 100 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక టిల్లు స్క్వేర్ సినిమాకు 27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే షేర్ 28 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇప్పటికే 22 కోట్లకు పైగా షేర్ వచ్చేసింది. ఇవాళ్టితో బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాక ప్రాఫిట్స్ కూడా వస్తాయి. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా 14 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుక్కుంది. మొత్తానికి టిల్లు స్క్వేర్ సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది.