Jai Hanuman : సూపర్ ఫాస్ట్ గా ‘జై హనుమాన్’ వర్క్.. అంజనాద్రి లొకేషన్ అదిరిపోయిందిగా.. వీడియో షేర్ చేసిన ప్రశాంత్ వర్మ..

తాజాగా ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు ప్రశాంత్ వర్మ.

Jai Hanuman : సూపర్ ఫాస్ట్ గా ‘జై హనుమాన్’ వర్క్.. అంజనాద్రి లొకేషన్ అదిరిపోయిందిగా.. వీడియో షేర్ చేసిన ప్రశాంత్ వర్మ..

Prasanth Varma Shared a Video and Posted As Anjanadri 2.0 Regarding to Jai Hanuman Movie

Updated On : March 31, 2024 / 9:50 AM IST

Jai Hanuman : హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న హీరో, చిన్న సినిమాతో వచ్చి ఏకంగా 300 కోట్లు, 50 రోజులు రికార్డులు సెట్ చేసింది హనుమాన్ సినిమా. దీనికి సీక్వెల్ జై హనుమాన్ కూడా ప్రకటించడంతో ఆ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆల్రెడీ జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందని, షూట్ కూడా మొదలుపెట్టారని ప్రశాంత్ వర్మ ఇటీవల తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపారు.

హనుమాన్ సినిమాలో అంజనాద్రి అనే ఊరుని చూపించారు. ఆ పక్కనే నది, మధ్యలో కొండలు.. ఇలా అందమైన లొకేషన్స్ చూపించారు. తాజాగా ఓ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు ప్రశాంత్ వర్మ. ఈ వీడియోలో ఓ నది మధ్యలో కొండలతో కొన్ని పడవలు వెళ్తుంటే చాలా అందంగా ఉంది. ఈ వీడియోని షేర్ చేసి అంజనాద్రి 2.0 అని పోస్ట్ చేసాడు. దీంతో ఇది జై హనుమాన్ లొకేషన్ వీడియో అని తెలుస్తుంది.

Also Read : Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ పాన్ ఇండియా రిలీజ్ లేదా..? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..

ఈ చిన్న లొకేషన్ వీడియోతోనే జై హనుమాన్ పై అంచనాలు పెంచేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఇది గ్రాఫిక్స్ తో చేసిన లొకేషన్ లా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అయినా అద్భుతంగా చూపిస్తాడు ప్రశాంత్ వర్మ అని పొగుడుతున్నారు. త్వరగా జై హనుమాన్ సినిమాని తీసుకురండి అని అడుగుతున్నారు నెటిజన్లు.