Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ పాన్ ఇండియా రిలీజ్ లేదా..? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
విజయ్ దేవరకొండ గత సినిమాల్లో లైగర్ తో బాలీవుడ్ కి వెళ్లినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఖుషి సినిమాని మాత్రం కేవలం తెలుగు, తమిళ్ లోనే రిలీజ్ చేసారు. ఇపుడు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి.
![Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ పాన్ ఇండియా రిలీజ్ లేదా..? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ పాన్ ఇండియా రిలీజ్ లేదా..? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..](https://10tv.in/wp-content/uploads/2024/03/family-star-1.jpg)
Vijay Deverakonda Mrunal Thakur Family Star Movie Pan India Release Clarity by Dil Raju
Family Star : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాని భారీగానే నిర్మించాడు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.
విజయ్ దేవరకొండ గత సినిమాల్లో లైగర్ తో బాలీవుడ్ కి వెళ్లినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఖుషి సినిమాని మాత్రం కేవలం తెలుగు, తమిళ్ లోనే రిలీజ్ చేసారు. ఇపుడు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల అందరు హీరోలు పాన్ ఇండియా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో తమ హీరో కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు.
Also Read : Kiara Advani : యశ్ ‘టాక్సిక్’ కోసం రామ్ చరణ్ భామ..?
తాజాగా నిర్మాత దిల్ రాజు దీనిపై స్పందించారు. ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఫ్యామిలీ స్టార్ సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నాము. ఆ తర్వాత రెండు వారాలకు హిందీ, మలయాళంలో విడుదల చేయాలనుకుంటున్నాము అని తెలిపారు. దీంతో ఫ్యామిలీ స్టార్ పాన్ ఇండియా రిలీజ్ లేనట్టే అనుకోవచ్చు. ఇప్పుడు రెండు భాషల్లో రిలీజయినా వచ్చే రెస్పాన్స్ బట్టే ఆ తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు మూవీ యూనిట్. కన్నడలో అయితే రిలీజ్ లేదని క్లారిటీ వచ్చేసింది. మరి విజయ్ నుంచి పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.