Kiara Advani : యశ్ ‘టాక్సిక్’ కోసం రామ్ చరణ్ భామ..?

ఇటీవల యశ్ టాక్సిక్ సినిమాలో కరీనా కపూర్ ఉండబోతుందని వార్తలు వచ్చాయి.

Kiara Advani : యశ్ ‘టాక్సిక్’ కోసం రామ్ చరణ్ భామ..?

Kiara Advani Will Act in Yash Toxic Movie Rumours goes Viral

Updated On : March 31, 2024 / 8:29 AM IST

Kiara Advani : కన్నడ హీరో ‘యశ్’(Yash) కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. కన్నడ సినీ పరిశ్రమ వ్యాల్యూని ఒక్కసారిగా పెంచాడు యశ్. అయితే ఆ రేంజ్ భారీ హిట్ సినిమాలు తీసాక యశ్ చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ లో యశ్ 19 సినిమా ప్రకటించారు. యశ్ 19 సినిమా KVN ప్రొడక్షన్స్ నిర్మాణంలో మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేయబోతున్నారు.

యశ్ 19 సినిమాకి ‘టాక్సిక్’(Toxic) అనే పవర్ ఫుల్ టైటిల్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం యశ్ అభిమానులతో పాటి కేజిఎఫ్ లాంటి సినిమాల తర్వాత యశ్ ఎలాంటి సినిమాతో వస్తాడో అని ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టాక్సిక్ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ డేట్ ప్రకటించారు.

Also Raed : Katha Venuka Katha : ‘కథ వెనుక కథ’ మూవీ రివ్యూ.. ఓటీటీలో మరో సస్పెన్స్ థ్రిల్లర్..

ఇటీవల యశ్ టాక్సిక్ సినిమాలో కరీనా కపూర్ ఉండబోతుందని వార్తలు వచ్చాయి. కరీనా కూడా ఓ సౌత్ సినిమాలో కీ రోల్ చేయబోతున్నాను అని చెప్పింది. ఇక తాజాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ భామ కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలు చేసింది. త్వరలో మరోసారి రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతుంది. ఇప్పుడు యశ్ సరసన టాక్సిక్ సినిమాతో కన్నడలో డెబ్యూట్ ఇవ్వబోతుంది అని వార్తలు వచ్చాయి. అయితే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.