Tillu Square : భారీ ధరకు అమ్ముడుపోయిన టిల్లు గాడి ఓటీటీ రైట్స్..

భారీ ధరకు అమ్ముడుపోయిన టిల్లు గాడి ఓటీటీ రైట్స్. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా..

Siddhu Jonnalagadda Anupama Parameswaran Tillu Square OTT satellite rights details

Tillu Square : టాలీవుడ్ మోస్ట్ ఎంటర్టైనర్ చిత్రం ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. సిద్ధూ జొన్నలగడ్డ కథని అందిస్తూ హీరోగా నటించారు. ఇక టిల్లు గాడికి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తే, నేహశెట్టి గెస్ట్ రోల్ లో కనిపించారు. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నిన్న మార్చి 29న థియేటర్స్ లోకి వచ్చింది. హిట్ సినిమాకి సీక్వెల్ గా వస్తుండడంతో.. ఆడియన్స్ లో ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది.

దీంతో మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద టిల్లు గాడి సందడి గట్టిగానే వినిపించింది. ఇక మూవీకి కూడా హిట్ టాక్ రావడంతో.. ప్రస్తుతం హౌస్ ఫుల్ షోస్ పడుతున్నాయి. కాగా ఈ మోస్ట్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. దాదాపు రూ.14 కోట్లు పెట్టి టిల్లు గాడి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. అలాగే ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని కూడా స్టార్ మా ఛానల్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Also read : Karthi – Vijay Deverakonda : స్టేజిపై కార్తీ – విజయ్ దేవరకొండ డ్యాన్స్ చూసారా?.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ కొనుగోలు చూస్తుంటే.. ఈసారి టిల్లు గాడి డీజే కొంచెం గట్టిగానే వినిపిస్తునట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ మొదటిరోజు రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. సిద్ధూ కెరీర్ లో ఇది హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఈ మూవీ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. సుమారు 54 కోట్ల గ్రాస్ ని అందుకోవాలి.

ప్రస్తుతం టిల్లు గాడి జోరు చూస్తుంటే.. మొదటి వీకెండ్ తోనే 54 కోట్ల మార్క్ ని అందుకొని బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపిస్తున్నాడు. కాగా ఈ మూవీ 100 కోట్ల మార్క్ ని కూడా అందుకుంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు