Tillu Square : టిల్లు స్క్వేర్ నుంచి కొత్త బ్రేకప్ సాంగ్ వచ్చేసింది.. ఓహ్ మై లిల్లీ..

టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్, ఓ సాంగ్ రిలీజ్ అయి భారీ అంచనాలు పెంచగా నేడు ఈ సినిమా నుంచి ఓ కొత్త సాంగ్ రిలీజ్ చేసారు.

Tillu Square : టిల్లు స్క్వేర్ నుంచి కొత్త బ్రేకప్ సాంగ్ వచ్చేసింది.. ఓహ్ మై లిల్లీ..

Siddhu Jonnalagadda Anupama Prameswaran Tillu Square Movie Breakup Song Released

Tillu Square : డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిన సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో రాబోతున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్, ఓ సాంగ్ రిలీజ్ అయి భారీ అంచనాలు పెంచగా నేడు ఈ సినిమా నుంచి ఓ కొత్త సాంగ్ రిలీజ్ చేసారు. ‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ అంటూ సాగే ఈ బ్రేకప్ పాటను తాజాగా రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని AMB సినిమాస్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. టిల్లు స్క్వేర్ నుంచి ఆ పాటని మీరు కూడా వినేయండి.

Also Read : Premikudu : రీ రిలీజ్ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభుదేవా ‘ప్రేమికుడు’ గ్రాండ్ రీ రిలీజ్..

ఈ పాటని సిద్ధూ, రవి ఆంటోనీ రాయగా అచ్చు రాజమణి దర్శకత్వంలో శ్రీరామ్ చంద్ర పాడారు. ఇక టీలు స్క్వేర్ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడగా మార్చ్ 29న రిలీజ్ కానుంది.