×
Ad

Siddhu Jonnalagadda: సిద్దు హీరోగా కొత్త సినిమా.. సితార బ్యానర్ లో ముచ్చటగా మూడోసారి..

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా హీరోగా కొత్త సినిమా ప్రారంభమయ్యింది. ఆయనకు డీజే టిల్లు, టిల్లు స్క్వైర్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు.

Siddhu Jonnalagadda new movie started under Sithara entertainments banner

Siddhu Jonnalagadda: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా హీరోగా కొత్త సినిమా ప్రారంభమయ్యింది. ఆయనకు డీజే టిల్లు, టిల్లు స్క్వైర్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నాడు. తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును దర్శకుడు స్వరూప్ RSJ తెరకెక్కిస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Bandla Ganesh: బండ్ల గణేష్ కొత్త నిర్మాత సంస్థ ‘BG బ్లాక్ బస్టర్స్’.. ఇకనుంచి తగ్గేదే లేదట..

మిషన్ ఇంపాజిబుల్ సినిమా అనుకున్న సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో మరోసారి తన మార్క్ ను చూపించుకోవడానికి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇక, సిద్దు(Siddhu Jonnalagadda)- స్వరూప్ సినిమాకు సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే విలేజ్ బ్యాక్డ్రాప్ లో థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా రానుంది అని తెలుస్తోంది. సిద్దు కూడా గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అని సమాచారం. అలాగే, తన మార్క్ కామెడీ కూడా ఎక్కడ మిస్ అవదట. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షార్ట్ చేసి 2026 సమ్మర్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్. మరి ఈ సినిమా అయినా సిద్దుకి అనుకున్న విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.

Siddhu Jonnalagadda new movie started under Sithara entertainments banner