Bandla Ganesh: బండ్ల గణేష్ కొత్త నిర్మాత సంస్థ ‘BG బ్లాక్ బస్టర్స్’.. ఇకనుంచి తగ్గేదే లేదట..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది బండ్ల గణేష్(Bandla Ganesh) అనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి కెమెడియన్ గా ఎంటరైన ఈ నటుడు చాలా కాలం తరువాత నిర్మాతగా మారి బ్లాక్ భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు.
Bandla Ganesh new production company BG Blockbusters
Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన నిర్మాత ఎవరైనా ఉన్నారంటే అది బండ్ల గణేష్(Bandla Ganesh) అనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి కెమెడియన్ గా ఎంటరైన ఈ నటుడు చాలా కాలం తరువాత నిర్మాతగా మారి బ్లాక్ భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి సినిమాగా రవి తేజ ‘అంజనేయులు’ సినిమా చేశాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేశాడు.
Pawan-Prabhas: పవన్, ప్రభాస్ చేసిన సాయం ఎవరికీ తెలియదు.. యాంకర్ సుమ ఎమోషనల్ కామెంట్స్
డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక అక్కడి నుంచి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారాడు బండ్ల గణేష్. ఆ తరువాత అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే, ఎన్టీఆర్ తో బాద్ షా సినిమాలు చేశాడు. ఆ తరువాత సినిమాలకు దూరమైనా బండ్ల గణేష్ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటుంది బండ్ల గణేష్ ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చూస్తున్నాడు.
అందుకే నిర్మాతగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని బ్లాక్ బస్టర్ గా స్టార్ట్ చేస్తున్నాడు బండ్ల గణేష్. అందుకోసం కొత్త నిర్మాణ సంస్థను స్థాపించాడు. అదే ‘బీజీ బ్లాక్ బస్టర్స్(బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్)’. తాజాగా ఈ సంస్థ కొత్త లోగోను కూడా విడుదల చేశారు. ఇక నుంచి ఈ సంస్థ నుంచి భారీ సినిమాలు వస్తూనే ఉంటాయని కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ బ్యానర్ పై మొదటి సినిమా ఏ హీరోతో చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
