Siddhu Jonnalagadda : రెండేళ్ల క్రితం చెప్పి మరీ సాధించాడు.. సిద్ధూ ‘టిల్లు స్క్వేర్’ 100 కోట్ల సక్సెస్..

టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసిందని నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా తెలిపారు మూవీ యూనిట్.

Siddhu Jonnalagadda Tillu Sqaure Movie Collections Report

Tillu Square Collections : సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయం సాధించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డీజే టిల్లు క్యారెక్టర్ మీద ఉన్న హైప్ తో టిల్లు స్క్వేర్ రావడంతో దీనికి కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.

టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజవ్వగా మొదటి రోజే 28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిర్మాత నాగవంశీ సినిమా రిలీజ్ కి ముందే 100 కోట్లు ఈ సినిమాతో సాధిస్తాం అని అన్నారు. చెప్పినట్టే నిన్నటి వరకు తొమ్మిది రోజుల్లో టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో టిల్లు స్క్వేర్ సినిమా ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది.

Also Read : Ram Charan Family : చిన్ని ఏనుగుతో సరదాగా చరణ్, క్లిన్ కారా, ఉపాసన.. వైరల్ అవుతున్న క్యూట్ ఫొటో.. రైమ్ కూడా..

టిల్లు స్క్వేర్ సినిమా 101.4 కోట్లు కలెక్ట్ చేసిందని నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని కూడా తెలిపారు మూవీ యూనిట్. సిద్ధూ జొన్నలగడ్డ రెండేళ్ల క్రితమే ఓ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ.. రాబోయే మూడేళ్ళలో నేను 100 కోట్లు కలెక్షన్స్ తెచ్చే స్టార్ అవ్వాలి అని చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని షేర్ చేస్తూ చెప్పి మరీ సిద్ధూ 100 కోట్లు సాధించాడు అని చెప్పడంతో అంతా సిద్ధూని అభినందిస్తున్నారు.

ఇక టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ రేపు ఏప్రిల్ 8న హైదరాబాద్ లో జరుగుతుండగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నారు. టిల్లు స్క్వేర్ కి కూడా సీక్వెల్ అనౌన్స్ చేస్తూ టిల్లు క్యూబ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.