×
Ad

OG: హైప్ కి పోయేలా ఉన్నాం సార్.. మీరు పవన్ కాదు తుఫాన్.. ఓజీపై సిద్దు క్రేజీ పోస్ట్

సినిమా లవర్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఒకే(OG) ఒక సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ(ఓజాస్ గంభీర).

Siddu Jonnalagadda's sensational post on the OG movie

OG: సినిమా లవర్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు ఒకే ఒక సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ(ఓజాస్ గంభీర). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్ స్టార్ మూవీపై ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ (OG)ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అవడలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కో అప్డేట్ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి.

Allu Arjun: ఏఏ 22 నుంచి అల్లు అర్జున్ ఫోటో లీక్.. సూపర్ హీరో లుక్ నెక్స్ట్ లెవల్

కేవలం ఆడియన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ కుర్ర హీరోలు మంచు మనోజ్, తేజ సజ్జా, అడివి శేష్, బెల్లంకొండ శ్రీనివాస్, అంకిత్ ఇలా ప్రతీ స్టార్ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ఏఫంక్షన్ జరిగినా ఓజీ నామ స్మరణ జరగాల్సిందే అంతలా రోజురోజుకి ఈ సినిమాపై క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది. తాజాగా ఓజీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోసిల్ మీడియా వేదికగా పంచుకున్నారు టాలీవుడ్ కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. “‘ఓజీ మూవీ హైప్‌ ప్రభావం మా హెల్త్‌పై పడేలా ఉంది. 25 వరకైనా ఉంటామో, పోతామో అర్థం కావడంలేదు. ఇప్పుడే ఇలా ఉదంటే 25వ తేదీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?. సార్ మీరు పవన్‌ కాదు.. మీరు గాలి తుపాన్’’ అంటూ రాసుకొచ్చారు సిద్దు. ప్రస్తుతం ఈ హీరో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.