Siddhu Jonnalagadda : మొహం మీద మచ్చలు పెట్టుకొని హీరో అయిపోతావా అన్నారు.. అన్‌స్టాపబుల్ షోలో ఏడ్చేసిన డీజే టిల్లు..
సిద్ధు కెరీర్ ఆరంభంలో తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బాలయ్యతో షేర్ చేసుకున్నారు. సిద్ధు మాట్లాడుతూ.............
- Saketh U
- Published On : October 21, 2022 / 01:00 PM IST
Sidhu Jonnalagadda got emotional in Unstoppable show
Siddhu Jonnalagadda : బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల మొదలైంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.
ఈ ఎపిసోడ్ లో ఇద్దరు యువ హీరోలు చాలా ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. సిద్ధు కెరీర్ ఆరంభంలో తనకి ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బాలయ్యతో షేర్ చేసుకున్నారు. సిద్ధు మాట్లాడుతూ.. ”ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంట సర్, గుంటూరు టాకీస్ సినిమా రాకముందు హీరోగా ట్రై చేస్తున్నాను. ఒకర్ని కలవడానికి వెళ్లి మాట్లాడాను. అప్పుడు అతను ఏంటి ఈ ఫేస్ మీద మచ్చలు పెట్టుకొని హీరో అవుతావా నీకంత సీన్ లేదు అన్నాడు. నాకు పింపుల్స్ వచ్చి పోయిన తర్వాత ఆ మచ్చలు అలా ఉండిపోయాయి. దీంతో నాకు బాగా ఏడుపొచ్చేసింది. అతను నేను హీరో అవ్వను అన్నాడు. ఎలాగైనా అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను సర్” అంటూ ఏడ్చేశాడు. దీంతో బాలయ్య కూడా కన్నీళ్లు పెట్టాడు. సిద్ధుని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు బాలయ్య బాబు. అన్‌స్టాపబుల్ షోలో సిద్ధు ఏడవడంతో ఈ వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
