Vishwaksen : నా సేవింగ్స్ అయిపోయాయి.. ఇల్లు తాకట్టు పెట్టి సినిమా తీస్తున్నా.. అక్కేమో హాస్పిటల్ లో ఉంది..

విశ్వక్ సేన్ కొన్ని రోజల క్రితం తను ఫేస్ చేసిన ఓ సన్నివేశాన్ని బాలయ్యతో షేర్ చేసుకున్నాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ''కొన్ని రోజుల క్రితం దాస్ కా ధమ్కీ షూటింగ్ జరుగుతుంది. రీసెంట్ గా ప్రొడ్యూసర్స్ షూట్స్ ఆపేసారు..................

Vishwaksen : నా సేవింగ్స్ అయిపోయాయి.. ఇల్లు తాకట్టు పెట్టి సినిమా తీస్తున్నా.. అక్కేమో హాస్పిటల్ లో ఉంది..

Vishwaksen emotional in Unstoppable show

Vishwaksen :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల మొదలైంది. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ వ్యూస్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ కూడా బాగా క్లిక్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో ఇద్దరు యువ హీరోలు చాలా ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. విశ్వక్ సేన్ కొన్ని రోజల క్రితం తను ఫేస్ చేసిన ఓ సన్నివేశాన్ని బాలయ్యతో షేర్ చేసుకున్నాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ”కొన్ని రోజుల క్రితం దాస్ కా ధమ్కీ షూటింగ్ జరుగుతుంది. రీసెంట్ గా ప్రొడ్యూసర్స్ షూట్స్ ఆపేసారు ఆ టైంలోనే. ఆ సినిమాకి నేనే నిర్మాతని, సెట్ వేశాము దానికి డబ్బులు కట్టాలి షూటింగ్ లేకపోయినా. బల్గెరియా నుంచి ఫైట్ మాస్టర్స్ ని తెప్పించాము. షూట్ లేకపోయినా వాళ్ళని చూసుకోవాలి. డబ్బులు అయిపోతున్నాయి. నాకేమో భయమేస్తుంది. నాన్న డబ్బులు తీసుకున్నాను, నా సేవింగ్స్ అయిపోయాయి. చివరికి ఇల్లు తాకట్టు పెట్టి షూటింగ్ మొదలుపెట్టాము.”

Dhamaka : అటు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే ఇటు నుంచి దీపావళే.. అదిరిపోయిన ధమాకా టీజర్..

”నేను షూటింగ్ లో ఉన్నప్పుడు అక్కకి హెల్త్ బాగోక హాస్పిటల్ లో పెట్టారు. పేరెంట్స్ నాకు చెప్పలేదు మొదట. తర్వాత ఫోన్ చేసి చెప్పారు ICU లో పెట్టారని. నైట్ హాస్పిటల్ లో ఉండి, మార్నింగ్ షూట్ కి వచ్చి దాదాపు ఒక వారం రోజులు ఏం చేస్తున్నానో కూడా అర్ధం కాలా. బాగా ఏడ్చేశాను. షూటింగ్ లో కూడా ఏడ్చాను. అటు అక్క హాస్పిటల్ లో ఉందని వదిలేయలేను. ఇటు నిర్మాతగా సినిమా వదిలేయలేను, డబ్బులు మొత్తం దీని మీదే పెట్టాను. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. కొన్ని రోజులకి తేరుకున్నాను. ఓరి దేవుడా సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాక నవ్వడం మొదలుపెట్టాను” అని తన బాధని తెలిపాడు.