Silambarasan : సిక్స్ మినిట్స్ సీన్.. శింబు సింగిల్ టేక్ యాక్టింగ్..

ఆరు నిమిషాల సీన్.. సింగిల్‌ టేక్‌లో నటించాడు సినీనటుడు శింబు. అందరిని ఆశ్చర్యపరిచాడు.. శింబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మనాడు. వి హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Silambarasan Okays A Six Minute Scene For Maanaadu In A Single Take

Silambarasan okays a six-minute scene : ఆరు నిమిషాల సీన్.. సింగిల్‌ టేక్‌లో నటించాడు సినీనటుడు శింబు. అందరిని ఆశ్చర్యపరిచాడు.. శింబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మనాడు. వి హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. నటి కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నటుడు శింబు, కళ్యాణి ప్రియదర్శన్, ఎస్‌ జె సూర్య, ప్రేమ్‌ జీ సీన్లను దర్శకుడు వెంకట్‌ ప్రభు అద్భుతంగా తెరకెక్కించారు.

యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆరు నిమిషాల సీన్ నటుడు శింబు సింగిల్‌ టేక్‌‌‌లో నటించి సింగల్‌ టేక్‌ నటుడిగా మరోసారి రుజువు చేశారు.

సీన్ పూర్తి కాగానే చిత్ర యూనిట్‌ అంతా ప్రశంసించారు. ప్రధాన పాత్రలో ఎస్‌జే. సూర్య నటిస్తున్నాడు. వైజీ.మహేంద్రన్, వాగై చంద్రశేఖర్, ఎస్‌ఏ చంద్రశేఖర్, ఆంజనా కీర్తి, ఉదయ, మనోజ్‌ కె భారతి, కరుణాకరణ్, మహత్, డేనియల్‌ పోప్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.