Dasara Movie: దసరాతో సిల్క్ స్మిత కనెక్షన్.. రివీల్ చేసిన డైరెక్టర్!
దసరా సినిమా పోస్టర్స్‌లో మనకు ఒకప్పటి హీరోయిన్ సిల్క్ స్మిత పోస్టర్ కూడా కనిపిస్తుంది. దసరా సినిమాకు, సిల్క్ స్మితకు కనెక్షన్ ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
- Anil Aaleti
- Published On : March 29, 2023 / 08:50 AM IST
Silk Smitha Connection With Dasara Movie Revealed By Director
Dasara Movie: నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.
Dasara Movie: యూఎస్ ప్రీసేల్స్ బుకింగ్స్‌తో దుమ్ములేపుతున్న ‘దసరా’
ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు భారీ ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే దసరా సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేస్తున్నారు. దసరా సినిమా పోస్టర్స్‌లో మనకు ఒకప్పటి హీరోయిన్ సిల్క్ స్మిత పోస్టర్ కూడా కనిపిస్తుంది. దీంతో అసలు దసరా సినిమాకు, సిల్క్ స్మితకు కనెక్షన్ ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన అసలు విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. తాను చిన్నతనంలో సింగరేణి ప్రాంతంలో పెరిగానని.. అప్పుడు తన తాతయ్యకు ప్రమాదం జరగడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యాడని శ్రీకాంత్ తెలిపాడు.
Dasara Movie: గ్రాండ్‌గా ‘దసరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు!
ఈ క్రమంలో తన తాతయ్యకు ఓ కల్లు దుకాణం నుండి కల్లు తీసుకొచ్చేవాడినని.. అక్కడ తనను బాగా ఆకర్షించిన పోస్టర్ సిల్క్ సిత్మది అని చెప్పుకొచ్చాడు. అయితే, అప్పటికి ఆమె ఒక హీరోయిన్ అని తనకు తెలియదని శ్రీకాంద్ తెలిపాడు. చాలా సంవత్సరాల పాటు తాను ఆ పోస్టర్‌ను పదేపదే చూస్తూ ఉండేవాడినని తెలిపాడు. దీంతో తన దసరా సినిమాలోనూ సిల్క్ బార్ అనే బార్ షాపులో సిల్క్ స్మిత పోస్టర్‌ను చూపెట్టానని దర్శకుడు శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇలా తన చిన్నతనంలో తనను బాగా ఆకర్షించిన సిల్క్ స్మితను ఈ సినిమాలో చూపెట్టడంతో ఆమెకు తనవంతుగా నివాళిని ఇస్తున్నట్లుగా ఈ యంగ్ డైరెక్టర్ తెలిపాడు.
