Dasara Movie: యూఎస్ ప్రీసేల్స్ బుకింగ్స్‌తో దుమ్ములేపుతున్న ‘దసరా’
మరో రెండు రోజుల్లో ‘దసరా’ సినిమాతో థియేటర్లలో ధూంధాం చేసేందుకు రెడీ అవుతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే $200K మేర ప్రీ-సేల్స్‌లో క్రాస్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Dasara Movie Solid Pre-Sales In US
Dasara Movie: మరో రెండు రోజుల్లో ‘దసరా’ సినిమాతో థియేటర్లలో ధూంధాం చేసేందుకు రెడీ అవుతున్నాడు నేచురల్ స్టార్ నాని. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ‘దసరా’ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.
Dasara Movie: గ్రాండ్‌గా ‘దసరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు!
ఇక ఈ సినిమాకు ప్రమోషన్స్ నెక్ట్స్ లెవెల్‌లో చేయడంతో, ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ఓవర్సీస్ ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రీ-సేల్స్‌తో దసరా ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే $200K మేర ప్రీ-సేల్స్‌లో క్రాస్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు మున్ముందు అక్కడ భారీ వసూళ్లు రావడం ఖాయమని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది.
Dasara Movie: నాని దసరా సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే..?
కాగా, ఈ సినిమాలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. మార్చి 30న రిలీజ్ అవుతున్న దసరా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.