Simbu-Trisha Marriage: నాన్నగారు ఒప్పుకున్నారా!..

  • Published By: sekhar ,Published On : October 16, 2020 / 10:05 PM IST
Simbu-Trisha Marriage: నాన్నగారు ఒప్పుకున్నారా!..

Updated On : October 17, 2020 / 7:37 AM IST

Simbu-Trisha Wedding: కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ Simbu, ప్రముఖ హీరోయిన్ Trisha ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని కొద్దిరోజులుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరూ బాగా దగ్గరయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని జాతీయ మీడియా సైతం కథనాలు రాసింది.


అయితే ఈ వార్తలపై అటు, త్రిష ఇటు శింబు ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల విషయమై శింబు తండ్రి టి.రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా శింబు, త్రిష పెళ్లి గురించి ఓ విలేకరి ఆయణ్ణి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాజేందర్ సమాధానం చెప్పలేదు.

Simbu-Trisha

కట్ చేస్తే.. పెళ్లి వార్తను శింబు తండ్రి ఖండించకుండా దాటవేయడం సంచలనంగా మారింది. దీంతో కోలీవుడ్ మీడియాలో మళ్లీ త్రిష-శింబు పెళ్లి వార్తలు మొదలయ్యాయి. ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చే వరకు రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. శింబు ఇప్పటికే పలువురు నాయికలతో ప్రేమాయణం నడిపి వారికి బ్రేకప్ చెప్పేశాడు. ఇక త్రిష కూడా అప్పట్లో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్
చేసుకుంది.