Ankitha : ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ నా బెస్ట్ ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు.. వాళ్ళతో స్నేహాన్ని బయటపెట్టిన అంకిత

తాజాగా చాలా సంవత్సరాల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అంకిత. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

Simhadri Heroine Aniktha comments on Aarthi Agarwal and Uday Kiran

Ankitha Jhaveri :  లాహిరి లాహిరి లాహిరి సినిమాతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ అంకిత. ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమలో పావని కళ్యాణ్, సింహాద్రి.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. సింహాద్రి(Simhadri) సినిమాలో చీమ చీమ సాంగ్ కి ఎన్టీఆర్ కి పోటీగా స్టెప్పులు వేసి బాగా వైరల్ అయింది. తెలుగు, తమిళ్ లో పలు సినిమాలు చేసింది అంకిత. 2009 తర్వాత సినిమాలకు దూరమయి, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లి సెటిల్ అయిపోయింది అంకిత.

తాజాగా చాలా సంవత్సరాల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అంకిత. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. తన సినిమాల గురించి, తన లైఫ్, ఫ్యామిలీ గురించి అనేక విషయాలు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడింది అంకిత.

Anasuya : అమెరికాలో అనసూయ.. నడిరోడ్డుపై నడుము చూపిస్తూ.. మామూలు రచ్చ కాదుగా..

అంకిత మాట్లాడుతూ.. ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్ నా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఇద్దరూ ఇప్పుడు లేరు. చాలా బాధగా ఉంటుంది ఆ విషయంలో. ఆర్తి, నేను చాలా క్లోజ్. మా సిస్టర్ పెళ్ళికి కూడా ఆర్తి వచ్చింది. ఆర్తి సినిమాలు మానేశాక అమెరికాలోనే ఉంది. అమెరికాలో రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. తాను ఇక్కడే చనిపోయింది అని ఎమోషనల్ అయింది అంకిత. ఉదయ్ కిరణ్ తో ఒక సినిమా ఓకే అయింది కానీ ఆ సినిమా ఆగిపోయింది అయినా మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. హైదరాబాద్ లో ఉంటే కలిసేవాళ్ళం అని చెప్పింది. దీంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ గురించి మాట్లాడటంతో అంకిత చేసినా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.