సచిన్, అజిత్‌‌లకు పోలిక భలే కుదిరిందే!

వైరల్ అవుతున్న సచిన్ పుట్టినరోజు, అజిత్ పెళ్ళిరోజు డేట్స్..

  • Publish Date - April 23, 2019 / 01:54 PM IST

వైరల్ అవుతున్న సచిన్ పుట్టినరోజు, అజిత్ పెళ్ళిరోజు డేట్స్..

సోషల్ మీడియా పుణ్యామా అని, ప్రపంచంలో మనకి తెలియని చాలా విషయాల గురించి (మంచి అయినా, చెడు అయినా) తెలుసుకుంటున్నాం. ఏదైనా ఒక విషయం ఒక్కరికి తెలిస్తే చాలు.. క్షణాల్లో అందరికీ షేర్ అయిపోతుంది. ఇక సినిమాల సంగతి అయితే చెప్పనవసరం లేదు.
Also Read : చెక్ చేశారా? : Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్

ఏదైనా రెండు భాషల సినిమాల మధ్య చిన్న లింక్ సింక్ అయిందంటే చాలు.. నెటిజన్స్ దాన్ని మామూలుగా ట్రోల్ చెయ్యరు. అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా జరుగుతాయండోయ్.. అలాంటి సంఘటన ఒకటిప్పుడు చోటు చేసుకుంది.
Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా

క్రీడాభిమానులు గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌కి, తమిళ స్టార్ హీరో తల అజిత్ కుమార్‌కి రెండు విషయాల్లో అనుకోని పోలిక ఒకటి కుదరింది.. అదేంటంటే, ఏప్రిల్ 24న సచిన్ బర్త్‌డే, అదేరోజు అజిత్ వెడ్డింగ్ యానివర్సరీ.. మే 1న అజిత్ బర్త్‌డే, ఆ రోజు సచిన్ వెడ్డింగ్ యానివర్సరీ.. ఒకరి పుట్టినరోజు నాడే, మరొకరి పెళ్ళిరోజు కావడంతో అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు.