Simran Choudhary : కొత్త హీరోతో సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా..

ఇప్పుడు మరో కొత్త హీరోతో జంట కడుతుంది సిమ్రాన్‌ చౌదరి.

Simran Choudhary New Movie with a New Hero Started

Simran Choudhary : సిమ్రాన్‌ చౌదరి వరుస సినిమాలతో హీరోయిన్ గా, స్పెషల్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తుంది. ఇప్పుడు మరో కొత్త హీరోతో జంట కడుతుంది సిమ్రాన్‌ చౌదరి. అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డిలు నిర్మాతలుగా రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌,`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా నేడు హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

హీరో, హీరోయిన్‌లపై తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, దర్శకుడు బాబీ ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాసరెడ్డి క్లాప్‌ కొట్టారు. ఈ సినిమాలో నందు, శివాజీరాజా, సత్య, హర్షవర్ధన్‌, టార్జాన్‌, హర్ష, భాషా, ఆమని, ఈటీవీ ప్రభాకర్‌, సమ్మెట గాంధీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ టీజర్ రిలీజ్.. అక్కినేని అమల చేతుల మీదుగా..

అనంతరం నిర్మాత శాంతనూపతి మాట్లాడుతూ.. మంచి సినిమా తీయాలని అమెరికా నుంచి వచ్చాము. కరోనా వల్ల చాలా టైం వేస్ట్‌ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విని ఈ కథ ఓకే చేశాము. సాయిమాధవ్‌ బుర్రాగారు మా సినిమాకు డైలాగ్స్‌ రాయడం సంతోషంగా ఉంది అని అన్నారు.

డైరెక్టర్ కార్తి మాట్లాడుతూ.. ఇది నాకు మొదటి సినిమా అయినా మంచి కథ, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు దొరికారు. జూన్ 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. 3 షెడ్యూల్స్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేస్తాము అని తెలిపారు.

రచయిత విశ్వజిత్‌ మాట్లాడుతూ.. ఈ కథ ఓకే అవ్వగానే సినిమా మొదలు పెట్ట్టాలేదు. రియాల్టీ చెక్‌ కోసం 6 జిల్లాల నుంచి వివిధ వర్గాలకు చెందిన దాదాపు 150 మందికి ఈ కథ చెప్పి వాళ్ళందరూ బాగుంది అన్నాకే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం అని తెలిపారు.