Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ టీజర్ రిలీజ్.. అక్కినేని అమల చేతుల మీదుగా..

అక్కినేని అమల చేతుల మీదుగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ టీజర్ ని విడుదల చేశారు.

Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ టీజర్ రిలీజ్.. అక్కినేని అమల చేతుల మీదుగా..

Chaitanya Rao Hebah Patel Honeymoon Express Movie Teaser Released by Akkineni Amala

Updated On : June 9, 2024 / 5:49 PM IST

Honeymoon Express : చైతన్యరావు(Chaitanya Rao), హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో KKR, బాలరాజ్ నిర్మాణంలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా తెరకెక్కింది. తనికెళ్ల భరణి, సుహాసిని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Kanchana 4 : దెయ్యం సినిమాలో సీత‌..! అస‌లు విష‌యం చెప్పిన రాఘ‌వ లారెన్స్‌

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా జూన్ 21న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పాటలు రిలీజ్ చేసి మెప్పించగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అక్కినేని అమల చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే భార్య భర్తల మధ్య వచ్చే గొడవలతో కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కించిన సినిమా అని అర్ధమవుతుంది. మీరు కూడా టీజర్ చూసేయండి..

ఇక టీజర్ లాంచ్ చేసిన అనంతరం అక్కినేని అమల మాట్లాడుతూ.. యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా డైరెక్టర్ బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. ఆయనకు తెలుగు సినిమాకు డైరెక్షన్ చేయాలని ఉండేది. ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో అది నెరవేరింది. మా అన్నపూర్ణ ఫిలిం స్టూడియోలో టీచింగ్ చేసి మాకు ఎంతో దగ్గరయ్యారు. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీ, స్టూడెంట్స్ ను కూడా బాల ఈ సినిమాలోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా బాగుంది అని తెలిపారు.

Chaitanya Rao Hebah Patel Honeymoon Express Movie Teaser Released by Akkineni Amala

డైరెక్టర్ బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. నా మనసులో అన్నపూర్ణ స్టూడియోస్ కు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికాలో ఉన్న నన్ను అమల గారు, నాగార్జున గారు ఇండియాకు తీసుకొచ్చి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కు డీన్ గా బాధ్యతలు అప్పగించారు. వాళ్ల ప్రోత్సాహంతోనే డైరెక్టర్ గా నా మొదటి సినిమా హనీమూన్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాను. నా మెంటార్ గా భావించే నాగార్జున గారు మా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యడం, అమల గారు టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది అని తెలిపారు.

Chaitanya Rao Hebah Patel Honeymoon Express Movie Teaser Released by Akkineni Amala