Kanchana 4 : దెయ్యం సినిమాలో సీత‌..! అస‌లు విష‌యం చెప్పిన రాఘ‌వ లారెన్స్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ కాంచ‌న‌.

Kanchana 4 : దెయ్యం సినిమాలో సీత‌..! అస‌లు విష‌యం చెప్పిన రాఘ‌వ లారెన్స్‌

Raghava Lawrence denies Mrunal Thakur has been cast in Kanchana 4

Updated On : June 9, 2024 / 4:38 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీ కాంచ‌న‌. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఆతరువాత వచ్చిన కాంచన 2, కాంచన 3 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా కాంచ‌న 4ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ మూవీకి కూడా రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

అయితే.. ఈ సినిమాలో ఎవ‌రెవ‌రు న‌టించ‌నున్నారు అన్న విష‌యాలు మాత్రం చెప్ప‌లేదు. ఇక ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ న‌టిస్తున్న‌ట్లు గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమెతో పాటు మ‌రికొంద‌రు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Kalki 2898 AD : ప్ర‌భాస్ ‘క‌ల్కి 2898AD’ నుంచి కొత్త పోస్ట‌ర్‌.. ఆశ ఆమెతోనే మొద‌లు..

దీనిపై రాఘ‌వ లారెన్స్ స్పందించాడు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌న్నాడు. అలాంటి వాటిని న‌మ్మొద్ద‌న్నాడు. కాంచ‌న 4లో న‌టించే న‌టీన‌టుల వివ‌రాల‌ను రాఘవేంద్ర ప్రొడక్షన్‌ ద్వారా అధికారికంగా వెల్ల‌డిస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని లారెన్స్ ట్వీట్ చేశాడు.

రాఘ‌వ లారెన్స్ చేసిన ట్వీట్‌తో మృణాల్ ఠాకూర్ కాంచ‌న 4 చిత్రంలో న‌టించ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.