Kalki 2898 AD : ప్ర‌భాస్ ‘క‌ల్కి 2898AD’ నుంచి కొత్త పోస్ట‌ర్‌.. ఆశ ఆమెతోనే మొద‌లు..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం క‌ల్కి 2898AD.

Kalki 2898 AD : ప్ర‌భాస్ ‘క‌ల్కి 2898AD’ నుంచి కొత్త పోస్ట‌ర్‌.. ఆశ ఆమెతోనే మొద‌లు..

Deepika Padukone New poster from Prabhas Kalki 2898 AD

Updated On : June 9, 2024 / 3:19 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం క‌ల్కి 2898AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తోంది. ఈ చిత్రంలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ అయిన బుజ్జి అనే కారును దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో తిప్పుతూ సినిమాపై బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇక మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌నున్నారు. సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ట్రైల‌ర్ విడుద‌ల కానుంది.

కాగా.. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆశ‌ ఆమెతో మొదలవుతుంది అంటూ దీనికి క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇందులో దీపిక ప‌దుకోనె ఎవ‌రికోస‌మే ఎదురుచూస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. మొత్తంగా ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.

NBK 109 : బాల‌య్య అభిమానుల‌కు పండ‌గే.. ఎన్‌బీకే 109 నుంచి ఫైరింగ్ అప్‌డేట్..

క‌ల్కి 2898AD చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ భైరవగా, అమితాబ్ బచ్చన్‌ అశ్వత్థామగా క‌నిపించ‌నుండ‌గా ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను లోక నాయ‌కుడు క‌మ‌ల్‌ హాసన్ పోషించారు. దీపికా పదుకోన్, దిశా పటానిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.