NBK 109 : బాలయ్య అభిమానులకు పండగే.. ఎన్‌బీకే 109 నుంచి ఫైరింగ్ అప్‌డేట్..
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టారు నందమూరి నటసింహం బాలకృష్ణ.

Massive update coming from NBK109
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. బాబీ డియోల్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో 109వ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. బాలయ్య పుట్టిన రోజు (జూన్ 10న) సందర్భంగా సాలీడ్ అప్‌డేట్‌ను ఇవ్వనున్నారు. దీనిపై సంగీత దర్శకుడు థమన్ నిన్న రాత్రే ఫైరింగ్ ట్వీట్ ఇవ్వనున్నట్లు ట్వీట్ చేయగా.. ఈ ఉదయం దర్శకుడు బాబీ ఇదే తరహాలో పోస్ట్ చేశాడు.
Kalki 2898 AD : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. కనీవినీ ఎరుగని స్థాయిలో.. అక్కడేనా?
దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. చిత్ర బృందం ఇచ్చే అప్‌డేట్ ఏంటా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
??#NBK109 https://t.co/lMrWEHNrle pic.twitter.com/Z6dRzwfsS5
— Bobby (@dirbobby) June 9, 2024