Kalki 2898 AD : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో.. అక్క‌డేనా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం క‌ల్కి 2898AD.

Kalki 2898 AD : ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో.. అక్క‌డేనా?

Prabhas Kalki AD 2898 pre release event in ap

Updated On : June 9, 2024 / 12:54 PM IST

Kalki 2898 AD Pre Release event : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం క‌ల్కి 2898AD. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తోంది. ఈ చిత్రంలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ అయిన బుజ్జి అనే కారును దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో తిప్పుతూ సినిమాపై బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇక మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే తెలియ‌జేశారు.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు చెన్నై, బెంగ‌ళూరులో ఎంపిక చేసిన థియేట‌ర్ల‌లో సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు క‌ల్కి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు మూవీ యూనిట్ స‌న్నాహ‌కాలు చేస్తోంద‌ట‌. ఈ ఈవెంట్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Gangs Of Godavari OTT : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఓటీటీ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగ్ కానుందంటే..?

ఈ వేడుక‌కు దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించే ప‌నిలో క‌ల్కి చిత్ర బృందం ఉందట‌. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఈవెంట్‌కు తీసుకువ‌చ్చే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. జూన్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు అనే ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

క‌ల్కి 2898AD చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, లోక నాయ‌కుడు క‌మ‌ల్‌ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Prabhas Bujji : ముంబై పోలీసుల చేతికి చిక్కిన ప్ర‌భాస్ బుజ్జి