Gangs Of Godavari OTT : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఓటీటీ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగ్ కానుందంటే..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ న‌టించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

Gangs Of Godavari OTT : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఓటీటీ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగ్ కానుందంటే..?

Gangs Of Godavari OTT

Updated On : June 9, 2024 / 10:25 AM IST

Gangs Of Godavari OTT release : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ న‌టించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో నేహా శెట్టి క‌థానాయిక‌. అంజ‌లి కీల‌క పాత్ర‌ను పోషించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించ‌గా 2024 మే 31న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విశ్వక్ సేన్ నటనకు ప్రశంసలు ద‌క్కాయి.

తాజాగా ఈ చిత్ర ఓటీటీ డేక్స్ ఫికైంది. ఈ మూవీ డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో చిత్రం అందుబాటులో ఉంటుంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, గోపరాజు రమణ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఓటీటీలో ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందుకుంటుందో చూడాల్సిందే.

Prabhas Bujji : ముంబై పోలీసుల చేతికి చిక్కిన ప్ర‌భాస్ బుజ్జి

కథ విషయానికొస్తే.. 

రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఉన్న ఓ గోదావరి లంకలో జరుగుతుంది. లంకలో పుట్టిన రత్న (విశ్వక్ సేన్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అనుకోకుండా ఓ కంపెనీ డీలర్ అవుతాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే దొరస్వామి(గోపరాజు రమణ) దగ్గర చేరి ఇసుక ర్యాంపులు చూస్తాడు. రాజకీయాల్లోకి వెళ్ళాలనుకొని దొరస్వామి ప్రత్యర్థి నానాజీ (నాజర్) తో చేతులు కలిపి ఎమ్మేల్యే అయిపోతాడు. అలాగే నానాజీ కూతురు బుజ్జి(నేహా శెట్టి) రత్న ప్రేమలో పడటంతో నానాజీకి కూడా శత్రువు అవుతాడు.

నానాజీ, దొరస్వామి రత్నని దెబ్బతీయాలని చూస్తారు. రత్న వెంట ఉన్న మనుషులు కూడా అతనిని చంపడానికి కత్తి కడతారు. వాళ్ళు ఎందుకు రత్నకు వ్యతిరేకంగా మారతారు? నానాజీ, దొరస్వామి రత్నని ఏం చేశారు? రత్నమాల(అంజలి) ఎవరు? ఆమెకు, రత్నకు సంబంధం ఏంటి? రత్న లైఫ్ లోకి బుజ్జి వచ్చిందా? రత్న తండ్రి ఎవరు? రత్న అందర్నీ ఎదురించి ఎలా నిలబడ్డాడు? ఈ కత్తి కట్టడం అంటే ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
A Masterpiece : ‘ఏ మాస్టర్ పీస్’ టీజర్ రిలీజ్.. శివుడితో కలిసొచ్చిన సూపర్ మ్యాన్.. ఓ రేంజ్‌లో ఉందిగా..