A Masterpiece : ‘ఏ మాస్టర్ పీస్’ టీజర్ రిలీజ్.. శివుడితో కలిసొచ్చిన సూపర్ మ్యాన్.. ఓ రేంజ్‌లో ఉందిగా..
తాజాగా నేడు 'ఏ మాస్టర్ పీస్' టీజర్ రిలీజ్ చేశారు.

Arvind Krishna Jyothi Poorvaj A Masterpiece Teaser Released
A Masterpiece Teaser : శుక్ర, మాటరాని మౌనమిది.. లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు సుకు పూర్వజ్ ఇప్పుడు ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాతో రాబోతున్నాడు. మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి.. ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ ఈ ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : Nikhil Siddhartha : ఆ ఎమ్మెల్యేతో కలిసి నారా లోకేష్ ని కలిసిన హీరో నిఖిల్..
గతంలో ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిపి ఓ కొత్త కాన్సెప్ట్ తో సూపర్ హీరో లాంటి మూవీని తీసుకురాబోతున్నారు. తాజాగా నేడు ‘ఏ మాస్టర్ పీస్’ టీజర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ టీజర్ చూసేయండి..
టీజర్ చూస్తుంటే తల్లి ప్రేమ, ఓ సూపర్ మ్యాన్, దైవ శక్తి, దుష్టశక్తి.. ఇలా మైథలాజి, సైన్స్ ఫిక్షన్ కలిపి సరికొత్తగా ఏదో తీయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.