Nikhil Siddhartha : ఆ ఎమ్మెల్యేతో కలిసి నారా లోకేష్ ని కలిసిన హీరో నిఖిల్..

తాజాగా నిఖిల్ చీరాల ఎమ్మెల్యేతో కలిసి టీడీపీ నేత నారా లోకేష్ ని కలిసాడు.

Nikhil Siddhartha : ఆ ఎమ్మెల్యేతో కలిసి నారా లోకేష్ ని కలిసిన హీరో నిఖిల్..

Hero Nikhil Siddhartha Meet Nara Lokesh with Chirala MLA MM Kondaiah

Updated On : June 7, 2024 / 8:55 PM IST

Nikhil Siddhartha : హీరో నిఖిల్ సిద్దార్థ వరుస సినిమాలతో, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం భారీ పీరియాడిక్ సినిమా స్వయంభు షూట్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా నిఖిల్ చీరాల ఎమ్మెల్యేతో కలిసి టీడీపీ నేత నారా లోకేష్ ని కలిసాడు. ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : Pithapuram – Pawan Kalyan : పిఠాపురంలో సక్సెస్ మీట్.. గెస్ట్ గా పవన్..? ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ కూడా అప్పుడే?

ఈ ఎన్నికల్లో నిఖిల్ బంధువు, నిఖిల్ కి మామయ్య వరుస అయ్యే MM కొండయ్య చీరాలలో టీడీపీ నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించారు. ఎన్నికల ముందు నిఖిల్ స్వయంగా వెళ్లి చీరాలలో MM కొండయ్య తరపున ప్రచారం చేసాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత చీరాల ఎమ్మెల్యే, తన మామయ్య MM కొండయ్యతో కలిసి హీరో నిఖిల్ నారా లోకేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Hero Nikhil Siddhartha Meets Nara Lokesh with Chirala MLA MM Kondaiah

లోకేష్ కూడా మంగళగిరి నుంచి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నారా లోకేష్ తో నిఖిల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.