Pithapuram – Pawan Kalyan : పిఠాపురంలో సక్సెస్ మీట్.. గెస్ట్ గా పవన్..? ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ కూడా అప్పుడే?

మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడుతూ.. సక్సెస్ మీట్ మాత్రం పిఠాపురంలోనే జరిగేలా చూస్తాను అని చెప్పారు.

Pithapuram – Pawan Kalyan : పిఠాపురంలో సక్సెస్ మీట్.. గెస్ట్ గా పవన్..? ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ కూడా అప్పుడే?

Manamey Movie Success Meet Planning in Pithapuram Pawan Kalyan as Guest if Possible

Updated On : June 7, 2024 / 7:37 PM IST

Pithapuram – Pawan Kalyan : శర్వానంద్, కృతిశెట్టి జంటగా నటించిన మనమే సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి నచ్చి దూసుకుపోతుంది. కామెడీ, లవ్, ఎమోషన్ లతో మనమే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ పిఠాపురంలో చేద్దామనుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవడంతో ఆ ఊరిపేరు దేశమంతా మారు మోగిపోతుంది.

అయితే పవన్ గెలుపు తర్వాత పోలీసుల నుంచి పిఠాపురంలో మనమే సినిమా ఈవెంట్ చేయడానికి పర్మిషన్ రాలేదు. దీంతో ఆ ఈవెంట్ ఇక్కడే నిర్వహించారు. మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడుతూ.. సక్సెస్ మీట్ మాత్రం పిఠాపురంలోనే జరిగేలా చూస్తాను అని చెప్పారు. తాజాగా నిర్మాత విశ్వప్రసాద్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురంలోనే మనమే సినిమా సక్సెస్ మీట్ నిర్వహించడానికి 100 శాతం ప్రయత్నిస్తాం. కుదిరితే పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్ గా పిలుస్తాము. పవన్ గారికి కుదరకపోతే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరికి వస్తారు అని తెలిపారు.

Also Read : Balakrishna : పొట్టేలు తలకాయలతో బాలయ్యకు దండ.. హిందూపురంలో మాస్ సెలబ్రేషన్స్.. ఈ వీడియో చూడండి..

అలాగే పిఠాపురంలో మనమే సక్సెస్ ఈవెంట్ జరిగితే అక్కడే ప్రభాస్ రాజాసాబ్ అప్డేట్ కూడా ఇస్తాము లేదా త్వరలోనే రాజాసాబ్ సినిమా నుంచి ఓ అప్డేట్ ఉంటుంది అని తెలిపారు. దీంతో అటు పవన్, మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పిఠాపురం ప్రజలు తమ ఊళ్ళో మొదటి సినిమా ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. మనమే సినిమా నిర్మాత విశ్వప్రసాద్ కి, పవన్ కళ్యాణ్ కి మంచి సంబంధాలు ఉన్నాయని తెలిసిందే.