సినిమాల్లో ఆంటీ రోల్స్‌ను ఉద్దేశించి ఇటీవల నటి సిమ్రన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దీనిపై ఆమె ఇవాళ మరోసారి స్పందించారు. ఆంటీ రోల్స్‌లో నటించడం సరికాదనేలా తన తోటి నటి చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు.
అందుకే తాను ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొని తన అభిప్రాయాన్ని చెప్పానని సిమ్రన్ అన్నారు. తాను సినిమాల్లో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అప్పుడప్పుడు ఆంటీ పాత్రల్లో నటిస్తున్నానని తెలిపారు. అలాంటి పాత్రల్లో నటించడంలో తప్పేముందని అడిగారు.
ఆ పాత్రలు తనకు ఇష్టమేనని సిమ్రన్ అన్నారు. అసలు సినీ పరిశ్రమలో ఉండే హీరోయిన్లు ఎన్నటికీ ఫ్రెండ్స్ కాలేరని చెప్పారు. తనకు ఎదురైన అనుభవంతో ఇది మళ్లీ రుజువైందని అన్నారు. ఫ్రెండ్స్ అని అనుకున్నవారు పలు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేసి ఎంతో బాధిస్తారని తెలిపారు.
Also Read: పాక్‌తో ఇక ఐసీసీ టోర్నీల్లోనూ భారత్ ఆడకూడదు అంతే..: గంగూలీ
ఆ నటి ఇటీవల జరిగిన ఈవెంట్ తర్వాత తనకు మరోసారి ఫోన్ చేశారని, తాను ఏమీ ఇబ్బంది పడలేదని సిమ్రన్ అన్నారు. అయితే, ఆ నటితో అంతకుముందున్నంత బంధం మాత్రం ఇప్పుడు లేదని చెప్పారు.
కాగా, ఇటీవల సిమ్రన్ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఓ నటికి ఇటీవల మెసేజ్ పంపానని, ఓ సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా బాగుందని చెప్పానని చెప్పారు. అయితే, ఆంటీ పాత్రల్లో యాక్ట్ చేయడం కంటే తనలా నటించడం చాలా ఉత్తమమని ఆ నటి సమాధానం ఇచ్చారని తెలిపారు. అయితే, పనికిమాలిన పాత్రల్లో యాక్ట్ చేయడంకన్నా ఆంటీ/అమ్మలాంటి రోల్స్‌లో నటించడం చాలా ఉత్తమమని అన్నారు. దీనిపైనే ఇవాళ మరోసారి స్పందించారు. సిమ్రన్ తాజాగా గుడ్‌బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు.